సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎక్కువ మంది నటీనటులు రంగస్థలం నుంచి వచ్చినవారే. అప్పట్లో స్టేజ్ నాటాకాలకుండే క్రేజే వేరు. తర్వాత సినిమా రంగం అభివృద్ధి చెందుతూ రావడంతో నాటక రంగం కనుమరుగైపోయింది.
సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎక్కువ మంది నటీనటులు రంగస్థలం నుంచి వచ్చినవారే. అప్పట్లో స్టేజ్ నాటాకాలకుండే క్రేజే వేరు. తర్వాత సినిమా రంగం అభివృద్ధి చెందుతూ రావడంతో నాటక రంగం కనుమరుగైపోయింది. నాటక రంగం నుంచి వచ్చిన ఒక నటి తన చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో తెలుసా. ఇంతకీ ఆ నటి ఎవరు? ఏ సినిమాలు చేసింది. తెలుసుకుందాం. ‘అదుర్స్’ సినిమా అంటే తెలియనివారుండరు. కామెడీ జానర్ సినిమాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయిందీ చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ టీవీలో వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాని బేస్ చేసుకుని ఎన్ని మీమ్స్ వచ్చాయో, ఎంతలా వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు.
ఇందులో బ్రహ్మానందం, ఎన్టీఆర్ సీన్స్ ఫోటోలను మీమ్స్ రూపంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వాడేస్తుంటారు. మాస్ చిత్రాలకు కేరాఫ్ ఆడ్రస్ అయిన వివి వినాయక్, మాస్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే ఉరమాస్ చిత్రాలు అయిన ‘ఆది’, ‘సాంబ’ గుర్తుకు వస్తాయి. కానీ వాటికి భిన్నంగా ‘అదుర్స్’ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ వివి వినాయక్. ఇందులో చారి పాత్రలో ఎన్టీఆర్ చేసిన కామెడీ అంతకుముందు, ఆ తర్వాత ఏ సినిమాలో కూడా చేయలేదు.
ఇక అసలు విషయానికి వస్తే ‘అదుర్స్’ సినిమాలో ఎన్టీఆర్‌కు బామ్మగా చేసిన సీనియర్ నటిని అంత త్వరగా మర్చిపోలేం. ఆమె కూడా కొన్ని సీన్లలో నవ్వులు పూయిస్తుంది. ఆ బామ్మా పేరు ‘వత్సల రాజగోపాల్’. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో ఆమెకు తెలుగు, తమిళంలో మంచి అవకాశాలొచ్చాయి. ‘విజేత’, ‘శబరి’, ‘అపరిచితుడు’, ‘అదుర్స్’ చిత్రాలతో మంచి గుర్తింపు సాధించింది.
అప్పట్లో వరుసగా సినిమాలు చేసే సమయంలో వత్సల ఎలా ఉండే వారో ఎవరికీ తెలియదు. ఆనాటి ఆమె ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పుడు కూడా చాలా బాగున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా ‘వత్సల రాజగోపాల్’ మొత్తంగా 450 సినిమాల్లో నటించారని సమాచారం. 2013వ సంవత్సరం నుండి సినిమాలకు విరామం ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ తమిళంలో టీవీ సీరియల్స్ చేస్తూ తనదైన శైలిలో జనాలను అలరిస్తున్నారు.