రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల కూతురు మెగా ప్రిన్సెస్ క్లింకారా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు. ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో ఖుషీ అవుతోన్న మెగా ఫ్యామిలీ.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మాటాల్లో చెప్పలేనిది. ఈ ఇద్దరు హీరోలకు కోట్ల సంఖ్యలో అభిమానులున్నారు. వీరిద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఇక చరణ్, ఎన్టీఆర్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన రోజు వేడకలు, సినిమా ప్రమోషన్లలో వీరిద్దరు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారట. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు
గత నెల 20వ తేదీన రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి పేరెంట్స్ క్లబ్ లో చేరిపోయారు ఈ దంపతులు. ఆడబిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీ అంతా మా ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందంటూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇక మెగా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడు కూతుర్ని మెగా ప్రిన్సెస్ అంటూ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మెగా ప్రిన్సెస్ కు క్లింకారా అని నామకరణం చేశారు మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ దంపతులకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ విలువైన గిప్ట్స్ కూడా అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారని సమాచారం. మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గోల్డ్ డాలర్స్ ను సర్ ప్రైజ్ గిఫ్ట్ గా అందించారట. ఆ గోల్డ్ డాలర్స్ పై రామ్ చరణ్, ఉపాసన, క్లింకార పేర్లు వచ్చే విధంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక ఆ గిప్ట్ ను ఎన్టీఆర్ వారసులైన అభయ్, బార్గవ్ రామ్ ల చేతుల మీదుగా రామ్ చరణ్ దంపతులకు అందించినట్లు సమాచారం. ఈ స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో మెగా ఫ్యామిలీతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.