జబర్దస్త్.. బుల్లితెరపై ఓ ప్రభంజనం సృష్టించిన, సృష్టిస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో. కేవలం జబర్దస్త్ కారణంగానే లైఫ్ లో సెటిల్ అయిన ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, అదిరే అభి.. ఇలా వీరంతా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది కేవలం జబర్దస్త్ పుణ్యమే. అయితే.., ఇక జబర్దస్త్ లో వీరు మాత్రమే కాకుండా చాలా మంది చిన్న ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. వీరిలో జబర్దస్త్ జీవన్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో జీవన్ ప్రేక్షకులను బాగానే నవ్విస్తూ వచ్చాడు. అయితే.., గత కొంత కాలంగా జీవన్ జబర్డస్త్ లో కనిపించకుండా పోయాడు. దీంతో.., యాజమాన్యం అతన్ని తొలగించిందని అంతా అనుకున్నారు. కానీ.., అందరికీ షాక్ ఇస్తూ జీవన్ తాజాగా ఎక్స్ ట్రా జబర్డస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో జీవన్ తళుక్కుమన్నాడు. అయితే.., ఒకప్పుడు బొద్దుగా ఉండే జీవన్ ఇప్పుడు బాగా సన్నబడి అస్సలు గుర్తు పట్టలేనంతగా చిక్కిపోయాడు. దీంతో.., జీవన్ అసలు ఏమైపోయావు అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ అతన్ని ప్రశ్నిచ్చింది. దీనికి జీవన్ కన్నీరు పెట్టుకుంటూ సమాధానం చెప్పాడు.
నేను ఈ రోజు బతికి ఉన్నానంటే నా టీం లీడర్స్ కారణం. మీరంతా లేకపోతే నేను చనిపోయేవాడిని. తక్కువ సమయంలోనే నాకు రెండుసార్లు నాకు సీరియస్ అయ్యింది. ఇక బతకనని డాక్టర్లు చెప్పేశారు. నాకు చిన్న బాబు మేడమ్. అమ్మ ఏడుస్తూనే ఉంది. ఇంజక్షన్స్ చేస్తున్నా బాడీ సహకరించలేదు. డాక్టర్లు బతకడం కష్టమని చెప్పేస్తే వీళ్లంతా నన్ను కాపాడారు మేడమ్.. అంటూ స్టేజ్ పైనే జీవన్ కన్నీరు పెట్టేసుకున్నాడు. దీంతో.., మిగతా ఆర్టిస్ట్ లు అంతా జీవన్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసినప్పటి నుండి జీవన్ కి ఏమై ఉంటుంది అంటూ.., నెటిజన్స్ తెగ గూగుల్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జీవన్ శ్వాస సంబంధిత వ్యాధితో ఎక్కువ రోజులు బాధపడినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి అందరికన్నా ముందుగా జీవన్ ని బతికించుకునే బాధ్యత తీసుకున్నాడట. అభి ముందుకి రావడంతో ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి వారు తలో చేయి వేశారట. ఇలా వీరంతా కలసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే జీవన్ బతికినట్టు తెలుస్తోంది. దీంతో.., జబర్దస్త్ లో ఉన్న ఐకమత్యాన్ని చూసి అంతా మెచ్చుకుంటున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.