ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని అందరికీ తెలిసిందే. ఎంతో మందిని సెలబ్రిటీలను చేసిన ఘనత ఈ షో సొంతం. అయితే గతకొంతకాలంగా చాలా మంది సీనియర్లు ఈ షో నుంచి వెళ్లపోవడం చూస్తూనే ఉన్నాం. అసలు వాళ్లు ఎందుకు వెళ్లిపోతున్నారు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా కిరాక్ ఆర్పీ ఆ షోపై పలు సంచలన ఆరోపణలు చేయడం చూశాం. ఆ ఆరోపణలపై హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.
ఆ ఆరోపణలపై క్లారిటీ ఇస్తానంటూ జబర్దస్త్ కు మేనేజర్ గా చేసిన ఏడుకొండలు సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ షోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే వెళ్లిపోయిన వారి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ షో పై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించడమే కాకుండా అసత్య ప్రచారాలంటూ కొట్టిపారేశారు కూడా. ప్రస్తుతం ఏడుకొండలు ఇంటర్వ్యూ యూట్యూబ్ వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: సుడిగాలి సుధీర్ కి లైవ్ లో జబర్దస్త్ ఏడుకొండలు కాల్.. మొత్తం బండారం బయటపెట్టేశాడు!
షో నుంచి వెళ్లిపోతున్న వారి గురించి ఏడుకొండలు మాట్లాడుతూ.. “సుధీర్, శ్రీను, చమ్మక్ చంద్ర అంతా అవకాశాలు కోసం ఎదురుచూస్తుండగా పిలిచి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. ఆ షో లేకపోతే వాళ్లకి ఈ హోదా వచ్చేదా? ఇప్పుడు వేరే వాళ్లి పిలిచి ఎక్కువ ఇస్తాం అంటున్నారు అంటే అది జబర్దస్త్ వల్లే కదా?” అంటూ సూటి ప్రశ్నలు సంధించారు.
ఇదీ చదవండి: కిరాక్ ఆర్పీపై ఓ రేంజ్ లో విరుచుకుపడిన జబర్దస్త్ ఏడుకొండలు..!
“వాళ్లంతా షో స్టార్టింగ్ లో నాకు మాటిచ్చారు. నేను ఇప్పుడు జబర్దస్త్ కి వచ్చి చెయ్యండి అంటే వాళ్లు చేయాల్సిందే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కావాలంటే ఊర్ల నుంచి కూడా ఫోన్లు వస్తాయి. నేను మళ్లీ వెళ్లి ఆ షో చేయాలి అని అనుకుంటే వాళ్లంతా చచ్చినట్లు రావాల్సిందే. లేదంటే నేను ఎవర్నీ వదలను. అలా మాట్లాడినందుకైనా వాళ్లని తిరిగి ఆ షోకి తీసుకెళ్లి పనిచేయిస్తా” అంటూ ఏడుకొండలు చెప్పుకొచ్చారు. ఏడుకొండలు పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.