జబర్దస్త్ లో తన ఆటో పంచ్ లతో అందరినీ నవ్వించే రాంప్రసాద్.. రీసెంట్ గా ఓ క్యాప్ పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి.. రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికి వచ్చేశాయి.
జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో ఆటో రాంప్రసాద్ ఒకరు. జబర్దస్త్ లో చేరాకే సుధీర్ తో పాటు రాంప్రసాద్, గెటప్ శ్రీను ఫేమ్ తెచ్చుకున్నారు. వీరు ముగ్గురు రీల్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఇచ్చిన క్రేజ్ తో అటు సినిమాలలో కూడా రాణిస్తున్నారు. సుధీర్ హీరోగా సినిమాలు చేస్తుండగా.. రాంప్రసాద్, గెటప్ శ్రీను కమెడియన్స్ గా చేస్తున్నారు. అయితే.. ప్రెజెంట్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారుగా.. రెగ్యులర్ గా ఏదొక పుకారు ఎవరో ఒకరి గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఆటో రాంప్రసాద్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అయ్యింది.
జబర్దస్త్ లో తన ఆటో పంచ్ లతో అందరినీ నవ్వించే రాంప్రసాద్.. రీసెంట్ గా ఓ క్యాప్ పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. పైగా కొద్దిరోజులుగా రాంప్రసాద్ ఆరోగ్యం బాగోలేదంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి.. రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికి వచ్చేశాయి. దీంతో ఫోటోలు చూసినవారంతా నిజంగా రాంప్రసాద్ కి క్యాన్సర్ వచ్చిందా? ఇప్పుడు అతని ఆరోగ్యం ఎలా ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా కిరాక్ ఆర్పీ మణికొండలో ఓపెన్ చేసిన నెల్లూరు చేపల పులుసు బ్రాంచ్ ఓపెనింగ్ కి వెళ్లిన రాంప్రసాద్ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.
కిరాక్ ఆర్పీ హోటల్ కి రాంప్రసాద్ తో పాటు జబర్దస్త్ టీమ్ అందరూ వెళ్లారు. అందరూ ఆర్పీకి విషెస్ చెప్పిన అనంతరం.. రాంప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ తో క్యాన్సర్ రూమర్స్ పై స్పందించాడు. రాంప్రసాద్ మాట్లాడుతూ.. “కొద్దిరోజులుగా నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. తలకు క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి నాకేదో అయ్యిందని.. క్యాన్సర్ అంటూ కథనాలు రాసుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే.. నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా. అందుకనే క్యాప్ పెట్టుకున్నా. అంతేగాని అంతకుమించి ఆరోగ్య సమస్యలేవీ లేవు. అలా రాయకండి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాంప్రసాద్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆటో రాంప్రసాద్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.