సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యిందంటే.. ఆ హీరో నుండి రాబోయే తదుపరి సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎక్సపెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఒకసారి పాన్ ఇండియా సినిమా అని 5 భాషల్లో రిలీజైన తర్వాత.. అది హిట్టయినా, ప్లాప్ అయినా ఫ్యూచర్ సినిమాలను ఫ్యాన్ బేస్ ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని అంటుంటారు. ఎందుకంటే.. ఆ హీరో ఏ సినిమా చేసినా చూసేందుకు రెడీగా ఉంటారు పాన్ ఇండియా ఫ్యాన్స్.
ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకుండానే ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. త్వరలోనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే.. లైగర్ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ‘జనగణమన’ మూవీ చేయనున్నాడు విజయ్.
ఈ క్రమంలో ఇటీవలే జనగణమన సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఎందుకంటే.. లైగర్ సినిమాతో ఆల్రెడీ విజయ్ పాన్ ఇండియా హీరో అయిపోతాడు కాబట్టి. ఫ్యూచర్ సినిమాలు కూడా అలాగే రిలీజ్ అవుతాయని అందరూ అలాగే ఎక్సపెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్ శివ నిర్వాణతో చేయబోయే ‘ఖుషి’ సినిమా విషయంలో హిందీ ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ షాకిచ్చాడని అంటున్నాయి సినీవర్గాలు.
తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఖుషి సినిమాకు హిందీ రిలీజ్ లేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఖుషి సినిమా కాశ్మీర్ నేపథ్యంలో.. ముస్లిం అబ్బాయికి, కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి మధ్య ఉండబోతుందని సమాచారం.
ఒకవేళ కాశ్మీర్ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటే మాత్రం.. ఖచ్చితంగా నార్త్ ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది. మామూలుగా లవ్ స్టోరీ అంటే అన్ని భాషలవారు కనెక్ట్ అవుతుంటారు. అలాంటప్పుడు సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఎందుకు ఖుషి మూవీని హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు? ముస్లిం అబ్బాయికి, పండిట్స్ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ.. వివాదంగా అయినా బాలీవుడ్ లో క్రేజ్ పొందే స్కోప్ ఉంది. మరి ఏదైతేనేం.. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను 4 భాషల్లోనే ప్లాన్ చేశాడు.
ఖుషి సినిమాకి ముందు రానున్న ‘లైగర్’ 5 భాషల్లో రాబోతుంది.. ఖుషి తర్వాత రాబోయే జనగణమన కూడా 5 భాషల్లో రిలీజ్ కానుంది. మరెందుకు ఖుషిని మాత్రం హిందీలో రిలీజ్ చేయట్లేదు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆల్రెడీ విజయ్ కి సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఖుషిని 4 భాషలకు పరిమితం చేస్తున్నారు? నార్త్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ ముందు హిందీని అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ లైగర్ రిలీజ్ అయ్యాక ఖుషి నార్త్ లో రిలీజ్ కాకపోతే నార్త్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అంటూ నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా సెన్సిబుల్ లవ్ స్టోరీస్ రూపొందించడంలో డైరెక్టర్ శివ నిర్వాణ దిట్ట అనిపించుకున్నారు. మరి ఆయన స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే విధానం నార్త్ ప్రేక్షకుల మైండ్ సెట్ కి సూట్ కాదని భావించారేమో అని మరికొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చివరిగా విజయ్ దేవరకొండ ఖుషి మూవీ హిందీ రిలీజ్ లేకపోవడానికి కారణం ఏంటనేది చిత్రబృందమే చెప్పాల్సి ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఖుషి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.