కిరాక్ ఆర్పీ కొన్ని రోజుల క్రితం సుమన్‌టీవీకిచ్చిన ఇంటర్వ్యూ ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ షో, దాని నిర్వహకుల మీద సంచలన ఆరోపణలు చేశాడు. సదరు ప్రొడక్షన్ సంస్థ ఆర్టిస్ట్‌లను ఎంతో నీచంగా చూస్తుందని.. తిండి కూడా సరిగా పెట్టరని కామెంట్ చేశాడు. సంస్థ తీరు సరిగా లేకనే.. చాలా మంది కమెడియన్స్ వెళ్లిపోతున్నారని ఆరోపించాడు. ఇంకా చాలా మంది బయటకు వెళ్లి పోతారని ఆర్పీ చెప్పుకొచ్చాడు. సదరు సంస్థ చేసే అవమానాలు భరించలేకనే సుధీర్ బయటకు వెళ్లిపోయాడని తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. చాలా మంది ఆర్పీ తీరుపై మండిపడ్డారు. జీవితాన్ని ఇచ్చిన సంస్థ గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు. మరి కొందరు మాత్రం ఆర్పీ చెప్పినవన్ని వాస్తవాలే.. అలా చెప్పడానికి గట్స్ ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్పీ వ్యాఖ్యలు ఎంతో వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో హైపర్ ఆది, రామ్ ప్రసాద్.. ఆర్పీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. అతను చెప్పినవన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఆకలిగా ఉన్నప్పుడు తిండి బాగాలేదంటే నిజాయితి అనుకోవచ్చు.. కానీ కడుపు నిండిన తర్వాత తిండి బాగాలేదని చెప్పడం సరికాదు.. చీటింగ్ అంటారు అని తెలిపాడు. ఆర్పీ కూడా తమలాంటి వాడే కానీ ఎందుకిలా అబద్ధాలు చెబుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు హైపర్ ఆది, రామ్ ప్రసాద్. ఇప్పటివరకు జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండించడానికే తాము ఈ ఇంటర్వ్యూకి వచ్చామని వారు పేర్కొనడం గమనార్హం.
ఆర్పీ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను కేజీఎఫ్ బానిసలుగా పోల్చడం సరికాదు అన్నాడు. ‘మల్లెమాల అమ్మ వంటిది.. జబర్దస్త్ అమ్మ లాంటిది’ అని గతంలో ఆర్పీ చేసిన కామెంట్స్ తాలూకు వీడియోలను చూపించారు ఆది, రామ్ ప్రసాద్. అలాంటి ఆర్పీ ఇప్పుడెందుకు ఇలా అంటున్నారో తెలియడం లేదని అన్నారు. షో నిర్మాత తమకు ఇళ్లు కొనుక్కొవడానికి ఎంతో సాయం చేశారని.. లక్షల డబ్బు అడ్వాన్స్ ఇచ్చారని.. అలాంటిది.. రెమ్యూనరేషన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు.
ఇది కూడా చదవండి: KiraaK RP: పంచ్ ప్రసాద్‌ను కాపాడటానికి నాగబాబు చాలా కష్టపడ్డారు: కిరాక్ RP
మల్లెమాల వారు సుధీర్‌ని అవమానించారని అనడం అబద్ధమని చెప్పారు. ఇప్పుడు సుధీర్‌ని పిలిచి ఆర్పీ చెప్పింది నిజమేనా.. అని అడిగితే అది కచ్చితంగా అబద్ధమని చెబుతాడని తెలిపారు. ఇప్పుడు వేరే ఛానల్ కు వెళ్లాం కదా అని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వాళ్లు బయటకు వెళ్లడానికి కారణం వాళ్లకు సినిమా అవకాశాలు రావడమే అని అన్నారు.
తను కూడా ‘జబర్దస్త్’కి గ్యాప్ ఇచ్చానని, ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. మరి వీరి వ్యాఖ్యలకు ఆర్పీ ఎలా కౌంటర్ ఇస్తాడో చూడాలి. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kiraak RP: ఆరోజు నేను పిచ్చోడిలా తిరుగుతుంటే నాగబాబు ఫోన్ చేసి..!