సాహసం చేయరా డింబకా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బెంగాలీ బ్యూటీ హమీద. కానీ ఆ సినిమాతో అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సోషల్ మీడియా పోస్టుల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు బిగ్‌బాస్ అవకాశం వచ్చింది. ఈ షో ద్వారా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హమీద. ఇక హౌస్‌లో సింగర్ శ్రీరామ్, హమీదకు మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. ఇక బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్లు యాంకర్ రవి, హమీద, శ్రీరామ్ ఇలా అంతా ఓ గ్యాంగ్‌లా ఉండేవారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వీరంతా కలిసిమెలిసి ఉంటున్నారు.
బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వీరంతా తరచుగా కలవడం.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. ఇక హమీద అయితే రవి ఫ్యామిలీతోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది హమీద. దీపావళి సందర్భంగా కొత్త కారు కొన్నది హమీద. ఖరీదైన బెంజ్ కారు కొన్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది హమీద. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
దీపావళి పండుగ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ కారు కొన్నది హమీద. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుం ఇవి వైరలవుతన్నాయి. ఈ ఫోటోల్లో హమీద కుటుంబం సభ్యులతో పాటు యాంకర్ రవి ఫ్యామిలీ కూడా ఉంది. కారు కొన్న తర్వాత వీరంతా డ్రైవ్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది.
ఈ సందర్భంగా రవి.. కారు ఫోటో, వీడియోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘వెల్కమ్ దీ బీస్ట్.. కంగ్రాట్యూలేషన్స్ హమ్ము.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. నీ న్యూ ప్రాజెక్ట్‌కు ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా డ్రైవ్’’ చేయ్ అంటూ పోస్ట్ చేశాడు. హమీద కారు కొనడంపై సింగర్ శ్రీరామచంద్ర స్పందించాడు. కంగ్రాట్స్ చెప్పాడు. అందుకు హమీద.. థాంక్యూ అంటూ శ్రీరామచంద్రకు రిప్లై ఇచ్చింది. అయితే ఈ కారు విలువ మాత్రం కనిష్టంగా యాభై లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది.