గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు మారు మ్రోగుతోంది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీను సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా సందర్భంగా గెటప్ శ్రీను పేరు బాగా వినిపిస్తోంది. మెగాస్టార్‌తో పాటు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడం ఇలా ప్రమోషన్స్ లో గెటప్ శ్రీను పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందంటూ గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా గురించే కాకుండా గెటప్ శ్రీను కెరీర్ గురించి, తొలినాళ్లలో అతను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.
“కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం ఎంతగానో తిరిగాను. ఆడిషన్స్ కి వెళ్లి వెళ్లి అసలు నాకు అవకాశం వస్తుందా అని నాకే అనుమానం కలిగేది. అప్పట్లో మ్యాగీ నేను కలిసి ఉండేవాళ్లం. నాగులోలు ఒక చిన్న రూమ్‌లో ఉండేవాళ్లం. బాత్ రూమ్‌కి డోర్ కూడా ఉండేది కాదు. పాటలు పాడుకుంటూ బాత్ రూమ్‌లో ఉండాలి. మ్యాగీ తనతోపాటుగా నన్ను తిప్పుతూ ఉండేవాడు. అతను ఇంటికి పంపుకోవాలి, అతని ఖర్చులు చూసుకోవాలి, నాకు హెల్ప్ చేయాలి. ఓ రోజు మ్యాగీ ఇంటికి వెళ్లాడు. నేను ఒక్కడినే రూమ్‌లో ఉన్నాను. నా దగ్గర రూపాయి కూడా లేదు. తినడానికి తిండి లేదు. రెండ్రోజులు అలా ఆకలితోనే ఉన్నాను. రాత్రి 11 గంటల తర్వాత పక్కింట్లో రెండు దానిమ్మ కాయలు దొంగిలించి తిన్నాను. అవి చాలా పచ్చిగా ఉండి నోరు మొత్తం పాడైంది. అలాంటివి ఎన్నో కష్టాలు పడ్డాను. కొన్నిసార్లు అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాను” అంటూ గెటప్ శ్రీను ఎమోషనల్ అయ్యాడు.