టాలీవుడ్ లో ‘జీరో సైజ్’ బ్యూటీ అనగానే మనకు ఈమెనే గుర్తొస్తుంది. 20ల్లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. అప్పట్లో ఈమె పేరు చెబితే చాలు, యూత్ అంతా ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. జస్ట్ ఈమె నడుము చూసేందుకే, ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాల్ని మళ్లీ మళ్లీ చూసేవారు. చెబుతుంటే కాస్త అతిగా ఉంది గానీ ఇదే నిజం. కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాలో కాకరేపుతోంది. ఇప్పుడు అలాంటి ఓ ఫొటోనే వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సన్నజాజి నడుముతో గుండెల్లో గుబులు రేపిన ఇలియానా.. తెలుగులో దాదాపు పదేళ్లకు పైనే ఏలింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిలైపోయింది. కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది కానీ అనుకున్నంతగా సక్సెస్ కావట్లేదు. సినిమాలు లేకపోతే ఏంటి.. సోషల్ మీడియా ఉందిగా అని అందులో రెచ్చిపోతుంది. ఫొటోషూట్స్ తో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది. తాజాగా ఇలియానా.. పసుపు రంగు బికినీ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. గుబులు రేపేలా ఉండటంతో.. యూత్ అంతా కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
Finally..#ileanadcruz
in a full-fledged #bikini👙 selfie🤳📸#BikiniWood pic.twitter.com/NLMgB8cDgJ— B I K I N I W O O D (@BikiniWood) October 3, 2022
ఇక ఈ ఫొటోకి ‘ఫెల్ట్ గుడ్ మే నాట్ డిలీటెడ్’ అనే క్యాప్షన్ ని ఇలియానా జత చేసింది. దీనిపై స్పందిస్తున్న పలువురు నెటిజన్స్.. ఈ బికినీ ఫొటోలు డిలీట్ చేయవు కదా! అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలియానా బికినీ ‘బ్రహ్మాస్త్ర’ కంటే బంపర్ హిట్టు అని రాసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ‘దేవదాసు’ సినిమాతో హీరోయిన్ గా మారిన ఇలియానా.. ‘పోకిరి’, జల్సా, కిక్, జులాయి లాంటి సినిమాలు చేసింది. ఇక 2012 తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలు చేసింది. కానీ కలిసి రాలేదు. ఇక హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితోనూ డేటింగ్ చేస్తూ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. మరి ఇలియానా యెల్లో బికినీ ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.