ఏ సినిమా అయినా కంటికి దృశ్యాన్ని అందంగా చూపించే కెమెరానే కాదు, దానికి తోడు శబ్దం కూడా ఉండాలి. ఆ శబ్దం లేకపోతే సినిమా అసంపూర్తిగా ఉంటుంది. చూడడానికి కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. సినిమా అన్నాక కనిపించే దృశ్యాలతో పాటు ఆ కదిలే దృశ్యాలకి తగ్గట్టు వెనక వచ్చే చప్పుళ్ళు కూడా ముఖ్యమే. సినిమాలో పాత్ర నడుస్తుంటే వచ్చే నడక శబ్దం నుంచి పోరాట సన్నివేశాల్లో వచ్చే శబ్దాల వరకూ.. తలుపు తీసినప్పుడు వచ్చే శబ్దం, గాలి వీచే శబ్దం ప్రతీది కీలకమే. ఆ చప్పుడు లేకపోతే ప్రేక్షకుడికి సినిమా చూసిన అనుభూతి ఉండదు. బయట నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు, ఎలా అయితే శబ్దాలు వస్తాయో అలానే.. సినిమాల్లో కూడా రియలిస్టిక్ గా ఉండాలి. దాని కోసం నిజంగానే శబ్దాలు చేస్తారు.
సౌండ్ ఎఫెక్టుల కోసం ప్రత్యేకంగా స్టూడియోలు, మనుషులు, పెద్ద సెటప్పే ఉంటుంది. బాహుబలి సినిమాలో గుర్రం పరిగెడుతుంటే వచ్చే కాళ్ళ చప్పుళ్ళు, గుర్రపు డెక్కల సౌండ్లు, గాల్లో ఎగిరే పక్షుల శబ్దాలు.. ఇలా పాత్రలు మాట్లాడుతుంటే వెనుక వచ్చే శబ్దాలను సమర్ధవంతంగా రికార్డు చేసే వారిని ఫోలీ ఆర్టిస్టులు అంటారు. మనం నిత్యం ఉపయోగించే వస్తువులతో సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ అందించడాన్ని ఫోలీ ఆర్ట్ అంటారు. ఫోలీ ఆర్టిస్టుల్లో గుర్తింపు తెచ్చుకున్న వారిలో కరణ్ అర్జున్ సింగ్ ఒకరు. సినిమాల్లో వచ్చే షాట్స్ కి తగ్గా సౌండ్ ని అందించడం ఈయన ప్రత్యేకత. ఎలాంటి శబ్దాన్ని అయినా రియలిస్టిక్ గా అందిస్తారు.
గుర్రం పరిగెడుతుంటే వచ్చే శబ్దం కోసం ఒక స్టూడియో రూమ్ లో ఉన్న చోటే పరిగెడుతూ శబ్దాలు చేయడం, దాన్ని రికార్డ్ చేయడం.. రాయి పడిన సౌండ్ కోసం నిజంగానే రాయిని కింద పడేయడం ఇలా చేస్తుంటారు. ఈ శబ్దాల కోసం వీళ్ళు పనికిరాని వస్తువులని కొనుగోలు చేస్తారు. అలా పనికిరాని వాటితో ఇలా పనికొచ్చే పని, పైకొచ్చే పని చేస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎలా అయినా బతికేయచ్చు. ఫోలీ ఆర్టిస్టులా మజాకా? ఫోలీ ఆర్టిస్టుల ప్రతిభ కూడా తోడవ్వడం వల్లే బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.
బాహుబలి సినిమాలో బ్యాగ్రౌండ్ శబ్దాలు చేసింది వీళ్లే, ఈ ఆర్టిస్టుల టాలెంట్ చూశారా..#foleyartist #Tollywood #Baahubali pic.twitter.com/MdDxFP8ysT
— BBC News Telugu (@bbcnewstelugu) October 2, 2022