దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలను హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, హాస్యనటులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకను పురస్కరించుకుని చిరంజీవి అల్లు రామలింగయ్యతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అలా మాట్లాడుతూ ఆయన సతీమణి సురేఖతో వివాహం గురించి సరదాగా వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడే చిరంజీవి ఎదుగుతున్న రోజులవి. అల్లు రామలింగయ్య, చిరంజీవి మధ్య అనుబంధం బలంగా ఉండేది.
చిరంజీవి అయితే తన కూతురు సురేఖకి పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ గా సరిపోతారని భావించి పెళ్లి ప్రపోజల్ పెట్టారు. అయితే చిరంజీవి కెరీర్ ముఖ్యమని, పెళ్లి ఇప్పట్లో వద్దని అన్నారు. దీంతో అల్లు రామలింగయ్య ఈ విషయాన్ని చిరంజీవి తండ్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చిరుని పెళ్లి చేసుకోమని అనడంతో మొహమాటం కొద్దీ ఒప్పుకోకతప్పలేదని చిరంజీవి గుర్తు చేశారు. “దండేసి గొర్రె పొట్టేలుని బలికి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారండి. తనకి మొహమాటం. ఎవరి మాటా కాదనలేను. అలాంటిది సురేఖతో పెళ్లి చూపులన్నారు. ఊ అందామా? ఊ.. ఊ.. అందామా?” అని అనుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. అయితే సురేఖని మొదటిసారిగా చూసిన చిరంజీవి.. మళ్ళీ చూడాలనిపించి చూశారట. ఆ తర్వాత ఆమె పెట్టిన కాఫీ తాగారట. అంతే ఆమెకి పడిపోయారట చిరంజీవి.
ఆ కాఫీలో ఏం మందు కలిపిందో గానీ.. ఆ క్షణంలో ఊ అనేశానని, ఊ.. ఊ.. అనడానికి ఏం లేదని, కళ్ళు మూసి తెరిచేలోగా పెళ్ళైపోయిందని చమత్కరించారు. చిరంజీవి మాటలకు అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. సరదాగా అంటున్న మాటలు కాబట్టి చిరంజీవి సతీమణి సురేఖ కూడా సరదాగా కాసేపు నవ్వుకున్నారు. చిరంజీవి అలా అంటారు గానీ ఇవాళ మెగా మహా వృక్షం ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే అది సురేఖమ్మ చలువే అని ఆయనకి తెలియదా! ఇంట్లో ఆడవాళ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. మగాళ్లు ఎలాంటి అవరోధాలైనా చిరునవ్వుతో అధిగమిస్తారు.
ఈరోజు చిరు ఉన్నత శిఖరాలను అధిగమించారు, ఆయన తర్వాత రామ్ చరణ్ కూడా అధిగమిస్తున్నారంటే దానికి కారణం మాతృమూర్తి ప్రోత్సాహమే. మొక్కలకి నీళ్లు పోసి వృక్షాన్ని చేసినట్లు.. మెగా వృక్షానికి నీరు పోసి కాపాడుకుంటున్నారు. ఈ విషయం చిరంజీవికి తెలుసు. అయినా గానీ నవ్వించాలని అలా అంటారు. సొసైటీ ఆఫ్ ఇండియాలో భార్యని ప్రేమించే ప్రతీ భర్త చెప్పే మాట ఇదే, తనకి బలవంతంగా పెళ్లి జరిగిందని. అదన్నమాట విషయం.