రోజా అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది. జబర్దస్త్ షో ద్వారా కూడా ఆమె ఫుల్ పాపులర్ అయింది. హీరోయిన్ గా చేసి ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేసి అంతకంటే ఎక్కువ అభిమానులను సంపాందించింది. ఆమె జీవితం మహిళకి స్ఫూర్తిదాయకం. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఆటుపోటు ఎదుర్కొన్ని ధైర్యంగా నిలబడింది. ప్రస్తుతం ఏపీ కేబీనెట్ లో మంత్రిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో టీవీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపైకి రీఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలో తన పిల్లల గురించి గుర్తు చేసుకుంటూ ఏడ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సాధారణంగా పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ బుల్లితెరపై సరికొత్త వినోద కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంటాయి. ఇప్పుడు రాబోతున్న దసరా పండుగ కోసం ప్రముఖ ఛానల్స్ సినీ, బుల్లితెర సెలబ్రిటీలతో ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాయి. ఎప్పటిలాగే ఓ ప్రముఖ ఛానల్ వారు ‘దసరా వైభవం’ అనే ప్రోగ్రామ్ తో ముందుకు రాబోతున్నారు. అయితే.. ఈ దసరా ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఆ ఈవెంట్ కోసం సీనియ నటి, ఏపీ మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే చివర్లో మంత్రి రోజా గారి జీవిత ప్రస్థానం గురించి చూపించారు. అది చూస్తూ.. రోజా ఎమోషనల్ అయ్యారు. “అందరి పిల్లాలలాగే వారికి మమ్మి అన్నం తినిపించాలని ఉంటుంది. కానీ నేను వెళ్లలేను. అందరికి కోవిడ్ అనేది ఓ కష్టమైన పిరియడ్. కానీ నాకు, నా పిల్లలకి మాత్రం అది హ్యాపీయెస్ట్ పీరియడ్” అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అలా ప్రోమో ఎండ్ అవుతోంది. అయితే పూర్తి ఎపిసోడ్ కోసం దసరా వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం దసరా వైభవం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.