ఒక్క తమిళ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో చియాన్ విక్రమ్. ఎప్పుడూ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సినిమా కోసం ఎంత కష్టమైనా సరే డెడికేటెడ్‌గా వర్క్ చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకడు. ఇప్పుడు కోబ్రా అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం సినిమాలో చియాన్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమానే కాకుండా విక్రమ్ కోబ్రా అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేశాడు. ఆ సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదలైంది. అందులో మ్యాథ్స్ టీచర్ గెటప్‌లో విక్రమ్ యాక్టంగ్ ఇరగదీశాడు. డిఫరెంట్ షేడ్స్ లో ఎప్పటిలాగానే విక్రమ్ ఆకట్టుకున్నాడు.
కోబ్రా సినిమా ఆగస్టు 31న విడుదల కానుంది. చిత్రబృందం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తోంది. విక్రమ్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవలే విద్యార్థులతో ముచ్చటించిన విక్రమ్ ఎమోషన్ అయ్యాడు. ఓ విద్యార్థి ఆత్మహత్యల గురించి ప్రశ్నించగా.. ఇన్‌స్పైరింగ్ సమాధానం చెప్పాడు.
The man with no haters !
The name is @chiyaan ! #Cobra From August 31st ! pic.twitter.com/UguvRHQNS4
— Prashanth Rangaswamy (@itisprashanth) August 24, 2022
“ఎందుకో ఈ జనరేషన్ ఇలా అయిపోయింది. మీరు బాగా చదవండి.. డిగ్రీలు సాధించండి నేను కాదనను. కానీ, ఒత్తిడికి గురి కాకండి. ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు చదువులోనే కాకుండా.. మిగిలిన విషయాల్లో కూడా ఆసక్తి ఉంటుంది. నేను అసలు నడవలేను అని చెప్పారు.. నేను ఇప్పుడు ఏకంగా నటించేస్తున్నాను” అంటూ విక్రమ్ చెప్పుకొచ్చాడు.
Trichy ♥️🙏🏻#Cobra #CobraFromAugust31 @chiyaan @MeenakshiGovin2 @mirnaliniravi @7screenstudio @AjayGnanamuthu pic.twitter.com/Jd9ynzJgeN
— Srinidhi Shetty (@SrinidhiShetty7) August 23, 2022
అంతేకాకుండా తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న విక్రమ్‌ను ఓ డైలాగ్ ను చెప్పమని కోరారు. అయితే విక్రమ్ మాత్రం ఒకే డాలాగ్ ను పది వేరియేషనల్లో చెప్పి చూపించాడు. పుష్ప సినిమాలోని “ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్” అనే డైలాగ్ ని 10 వేరియేషన్లలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కోబ్రా సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.