మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. తన పట్టుదల, స్వయంకృషితో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఇక సామాన్యులే కార పరిశ్రమకు చెందిన వారు సైతం.. ఆయనను అభిమానిస్తారు. తమ జీవితంలో.. ఒక్కసారైనా సరే.. మెగాస్టార్ నుంచి చిరు ప్రశంస దక్కితే చాలు.. జన్మ ధన్యమైనట్లే అనుకుంటారు. ఇక బర్త్‌డే, సినిమాల విడుదల సందర్భంగా చిరంజీవి మెసేజ్ చేస్తే.. సంతోషంతో పొంగిపోతారు. చిరు మెసేజ్ అంటే.. అంత ప్రత్యేకత. కానీ యాంకర్ సుమ మాత్రం.. మూడేళ్ల పాటు చిరంజీవి మెసేజ్ చేసినా పట్టించుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే వెల్లడించారు. ఈ వార్త తెలిసి అందరూ షాకవతున్నారు. మెగాస్టార్ మెసేజ్ చేయడమే గొప్ప.. అలాంటిది రిప్లై ఇవ్వకపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి సుమ ఎందుకు అలా చేసిందో తెలియాలంటే.. ఇది చదవండి..
సుమ అడ్డ అనే కొత్త ప్రొగ్రాం చేస్తోంది సుమ. ఈ షోకు సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు. ఆయనతో పాటు వాల్తేరు వీరయ్య దర్శకడు బాబీ, వెన్నెల కిషోర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు లీక్స్‌లో భాగంగా.. మా షోలో ఏమైనా లీక్స్ ఉన్నాయా అని సుమ ప్రశ్నించింది. అప్పుడు చిరంజీవి.. ఎవరి గురించో ఎందుకు.. సుమ గురించే లీక్ చేస్తే పోలా అనుకుని.. ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘పబ్లిక్‌గా చెప్తున్నాను.. ఎంత అన్యాయం అంటే సుమ బర్త్‌డేకి విషెస్ చెప్తూ వరుసగా 3-4 సంవత్సరాలు మెసేజ్ చేశాను. కానీ.. ఒక్క సారి కూడా ఆమె నుంచి రిప్లై లేదు. చిరంజీవి మెసేజ్‌కి సమాధానం చెప్పని, రిప్లై ఇవ్వని ఒకే ఒక వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే.. అది సుమ’’ అని వెల్లడించారు చిరంజీవి.
చిరంజీవి మాటలు విని అక్కడున్న వారు.. ఆశ్యర్యపోయారు. సుమ కూడా అవునని అంగీకరిస్తూనే.. అలా ఎందుకు జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది. ‘‘చిరంజీవి గారు మూడేళ్ల నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారని.. నిజంగా నాకు తెలీదు. 2022లో అనుకుంటా.. నా పుట్టిన రోజు నాడు చిరంజీవి గారు కాల్ చేసి.. హ్యాపీ బర్త్‌డే అని విష్ చేశారు. ఆ తర్వాత నేను మూడేళ్ల నుంచి నీ పుట్టిన రోజు నాడు విష్ చేస్తూ.. మెసేజ్ చేశాను.. కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు. ఎందుకు అని అడిగారు. అప్పుడు నాకు అర్థం అయ్యింది. నిజంగా చిరంజీవి గారు మెసేజ్ చేస్తారని ఎవరైనా ఊహిస్తారా.. నేను కూడా ఎవరో కావాలనే ఇలా చేశారని అనుకున్నాను. ఎవరు అనుకుంటారండి.. చిరంజీవి గారు నాకు మెసేజ్ చేస్తారని’’ అని చెప్పుకొచ్చింది.
అయితే ఈ షోకి చిరంజీవితో పాటు వచ్చిన కమెడియన్ వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. సుమ వివరణ పెద్దగా కన్విన్సింగ్‌గా లేదు అంటూ ఆమెకి కౌంటర్ ఇచ్చాడు. దాంతో సుమ కోపంగా వెళ్లి వెన్నెల కిషోర్‌ని కొట్టేయబోయింది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి సార్.. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సుమ రిప్లై ఇవ్వకపోయినా.. థర్డ్ ఇయర్ కూడా మీరు మెసేజ్ పెట్టారు చూడండి.. మీరు గ్రేట్ సార్ హ్యాట్యాఫ్’ అంటూ దండం పెట్టేశాడు.
అప్పడు చిరంజీవి ‘‘రిప్లై ఇవ్వకపోవడం తన (సుమ) గర్వం. సారీ.. తన నైజం. అయినా.. అలాంటి వారిని విష్ చేయడం నా నైజం’’ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ.. ‘‘నిజంగా చెప్తున్నాను.. చిరంజీవి గారు నాకు ఎందుకు మెసేజ్ చేస్తారనే ఫీలింగ్‌లోనే ఉన్నాను.. అంతే తప్ప’ అని ఏదో చెప్పబోయింది. వెంటనే అందుకున్న వెన్నెల కిషోర్.. పక్కనే ఉన్న డైరెక్టర్ బాబీతో ‘చెప్పానా.. సుమ చాలా జోక్‌లు వేస్తారని’ అని కౌంటర్ ఇచ్చాడు.
ఫైనల్‌గా అసలు విషయం చెప్పుకొచ్చారు చిరంజీవి. ‘‘2022లో ఎక్కడో కలిసినప్పుడు ఆ మెసేజ్‌ల గురించి సుమని అడిగాను. దానికి సుమ.. నిజంగా అది మీరా.. నేను అనుకోలేదండి.. కనీసం క్రాస్ చెక్ కూడా చేయలేదని చెప్పింది.. ఆ తర్వాత క్షమాపణ చెప్పి.. చాలా ఫీలైంది. వెంటనే నా నెంబరు తీసుకుని సేవ్ చేసుకుంది’’ అని ముగించారు. మరి సుమ రిప్లైపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.