టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పనులు ప్రారంభం అయిన నాటి నుంచి.. అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అలీ దంపతులు. ఇక కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి టాప్ సెలబ్రిటీలను వివాహానికి ఆహ్వానించాడు అలీ. అలానే హాల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక అలీ-జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియలో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇక ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ఫాతిమా వివాహానికి.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున దంపతులు, ఎమ్మెల్యే ఆర్కే రోజ తదితరులు హాజరయ్యారు. వీరంతా ఫాతిమా దంపతులను ఆశీర్వదించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి.. వివాహ వేడుకకు వచ్చి.. అలీతో సరదాగా మాట్లాడారు. అతడిని ఆలింగనం చేసుకుని.. శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నూతన దంపతులను ఆశీర్వదించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. అలీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజనులు.
B O S S #MegastarChiranjeevi garu today @#Ali Daughters Marriage 🤩#ValtheruVerayya #BossParty@KChiruTweets @Chiru2020_ @Deepu0124 @Chirufan4ever @ChiruIdealActor @Chiru_FC @ChiruFanClub @Chiru025527081 @EluruMegaFan @GaddamMega @Konidelachiru31 pic.twitter.com/KADKQeGnEQ
— Ramesh BOLLI (@RameshBOLLIS) November 27, 2022