బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఎవరంటే.. సిరి హన్మంత్-శ్రీహాన్ అని చెప్తారు. సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా.. ఎలా ప్రవర్తించింది.. ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీవీక్లో భాగంగా.. కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సిరి బాయ్‌ఫ్రెండ్.. శ్రీహాన్.. హౌస్‌లోకి వచ్చి.. నన్ను మర్చిపోయావా అంటూ చెప్పిన ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సిరికి మించి పాపులారిటీ సాధించుకున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీహాన్. విన్నర్ కావాల్సిన వాడు కాస్త.. 40 లక్షల రూపాయలు తీసుకుని.. రన్నర్‌గా నిలిచాడు. ఇక సిరి-శ్రీహాన్‌లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరద్దరూ ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరు చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
సిరి-శ్రీహాన్‌లు పెంచుకుంటున్న పిల్లాడి పేరు చైతు. మాట వినకుండా అల్లరి చేస్తున్న కొడుకుని బెదిరించడం కోసం.. శ్రీహాన్.. బెల్ట్‌తో తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. ఎన్నిసార్లు చెప్పాలి.. నామాట వింటావా.. లేదా అని అరుస్తూ.. బెల్ట్‌తో కొట్టుకుంటున్నట్లు యాక్ట్ చేస్తాడు. అప్పుడు చైతూ.. నీ మాట వింటా డాడీ.. కొట్టుకోవద్దు.. సారీ అంటూ ఏడుస్తాడు. ఈమొత్తం సీన్‌ని సిరి వీడియో తీస్తుంటుంది. ఇక చైతూ మాట విని.. నవ్వుతుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది వైరలవుతోంది.
అయితే ఈ వీడియోపై సింగర్ చిన్మయి శ్రీపాద.. ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలను బెదిరించడానికి ఇలాంటి పనులు చేయడం సరికాదు అంటూ మండి పడింది. ‘‘మనకు మనం హాని చేసుకోవడం.. పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది తల్లిదండ్రులు.. పిల్లలు తాము చెప్పినట్లు.. నడుచుకోకపోతే.. వారిని బెదిరించడం కోసం తమను తాము కొట్టుకుంటారు.. చనిపోతామని బెదిరిస్తారు. మరీ ముఖ్యంగా.. వాళ్లు చూసిన సంబంధం చేసుకోకపోతే.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఈ ధోరణికి.. కనీసం ఈ జనరేషన్లో అయినా ముగింపు పలకాలి’’ అంటూ పోస్ట్ చేసింది.
దీనిపై నెటిజనులు.. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీహాన్ ఫ్యాన్స్ చిన్మయి మీద ఫైరవుతున్నారు. వాళ్లేదో సరదాగా చేశారు.. దానినంత సీరియస్‌గా తీసుకుంటున్నారేంటి.. అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరున నెటిజనులు మాత్రం.. పిల్లల ముందు.. మనకు మనం ఇలా హాని చేసుకోవడం చాలా తప్పు. పిల్లల్ని ఇలానే పెంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకు సిరి-శ్రీహాన్ చేసిన పని సరైందే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.