వాళ్లు యూట్యూబర్సే. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చి వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయిపోయారు. ఓ సీజన్ లో ఆమె కంటెస్ట్ చేయగా, తాజాగా జరిగిన సీజన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ పోటీ పడ్డాడు. ఇలా బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్లలో పాల్గొన్న రియల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లే శ్రీహాన్-సిరి. వీళ్లిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. అలానే ఓ బాబుని కూడా పెంచుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి శ్రీహాన్ బయటకొచ్చేసిన తర్వాత సోషల్ మీడియా అంతా వీళ్లదే అన్నట్లు పోస్టులు పెడుతున్నారు. అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఓ నెటిజన్ పెళ్లి గురించి అడగ్గా.. సిరి క్లారిటీ ఇచ్చేసింది.
ఇక విషయానికొస్తే.. సిరి యూట్యూబర్ గా బాగానే తెలుసు. శ్రీహాన్ తోనే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఆమె.. బిగ్ బాస్ ఐదో సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పోటీ చేసింది. కానీ ఆ సీజన్ లో షన్నుతో రాసుకు పూసుకు తిరగడం చాలామందికి విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఫ్రెండ్ షిప్ పేరు చెప్పి, షన్నుతో చేసిన ప్రవర్తించిన తీరు ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. అయితే అదంతా షో కోసం చేసిన హంగామా అని తర్వాత తెలిసి అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇక ఆ సీజన్ లో ఆమెకు సపోర్ట్ చేయడానికి శ్రీహాన్.. బిగ్ బాస్ కి కూడా వచ్చాడు.
ఇక తాజాగా పూర్తయిన సీజన్ లో శ్రీహాన్ ఓ కంటెస్టెంట్ గా ఆడాడు. తన గేమ్ తో చివరి వరకు వచ్చేశాడు. అయితే రూ.40 లక్షలు తీసుకుని గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడంతో రేవంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక షో నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్న శ్రీహాన్, సిరితో కలిసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా జరిగిన సిరి బర్త్ డేని శ్రీహాన్ గ్రాండ్ గా జరిపాడు. ఖరీదైన రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన ఫాలోవర్స్ తో సిరి ముచ్చటించగా.. పలు ప్రశ్నలు అడిగారు. శ్రీహాన్ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని ఓ ఫాలోవర్ అడగ్గా.. త్వరలోనే చేసుకుంటాం అని సిరి క్లారిటీ ఇచ్చింది. కానీ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. మరి శ్రీహాన్-సిరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.