తమిళ హీరో విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన ‘బిచ్చగాడు 2’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ హిట్ ఫిల్మ్‌ను మీ ఫోన్లలోనే చూసేయొచ్చు.
ప్రముఖ తమిళ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీకి అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. సంగీత దర్శకుడిగా తమిళనాట బాగా పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత నటనపై ఇష్టంతో హీరోగా చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ అనువాదమై ఇక్కడా మంచి విజయాలుగా నిలిచాయి. వాటిల్లో ‘నకిలీ’, ‘సలీం’ ఉన్నాయి. ఇక, ‘బిచ్చగాడు’ మూవీ విజయ్ను ఓవర్‌నైట్ స్టార్ చేసేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ ఫిల్మ్‌ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ‘భేతాళుడు’, ‘యముడు’, ‘కాళీ’, ‘రోషగాడు’, ‘కిల్లర్’ లాంటి సినిమాల్లో నటించారు విజయ్ ఆంటోనీ. కానీ అవేవీ ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.
కొంత గ్యాప్ తర్వాత ‘బిచ్చగాడు’ సీక్వెల్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చారు విజయ్ ఆంటోనీ. ఈ సమ్మర్లో రిలీజైన ‘బిచ్చగాడు 2’ మంచి హిట్‌గా నిలిచింది. తమిళంలో కంటే ఈ మూవీకి తెలుగు నాట కలెక్షన్స్ ఎక్కువగా రావడం గమనార్హం. అలాంటి ‘బిచ్చగాడు 2’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు అంతా రెడీ అయింది. జూన్ 18వ తేదీ నుంచి ఈ చిత్రం ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. మరికొన్ని గంటలు ఎదురు చూస్తే చాలు.. విజయ్ ఆంటోనీకి మరో హిట్‌గా నిలిచిన ‘బిచ్చగాడు 2’ను ఓటీటీలో చూసేయొచ్చు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు కూడా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకొని చూడొచ్చు. మరి.. ‘బిచ్చగాడు 2’ను ఓటీటీలో చూసేందుకు మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.