5 స్టార్ హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని, మోడల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో విహరించాలని ఎన్నో కలలతో వస్తారు. కానీ అవకాశాలు అందరికీ రావు. దీంతో కొంతమంది ఈజీ మనీ కోసం తప్పుడు పనులు చేస్తుంటారు. డబ్బున్న వాళ్ళను ట్రాప్ చేసి వ్యభిచారం నిర్వహిస్తుంటారు. తాజాగా మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న నటిని, మోడల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో స్కెచ్ వేసి హోటల్ పై దాడులు చేశారు. వివరాల్లోకి వెళ్తే పుణెలోని వాకడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్స్ లో భోజ్ పురి నటి, మోడల్ తమ ఏజెంట్ తో కలిసి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీకి వచ్చే మహిళలను ట్రాప్ చేసి బలవంతంగా ఈ బురదలోకి లాగుతున్నారు.
వీరిని అడ్డం పెట్టుకుని ఒక రాత్రికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు సంపాదిస్తున్నారు. ఎట్టకేలకు ఈ గ్యాంగ్ ను పోలీసులు చేధించారు. ఓ హోటల్ లో రహస్యంగా నిర్వహిస్తున్న సె*క్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు. భోజ్ పురి నటి సహా ఒక మోడల్ ను, ఏజెంట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నటి, మోడల్ ఇద్దరూ ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా కస్టమర్లను ఆకర్షించి భారీగా డబ్బులు గుంజుకుంటున్నారని వాకడ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి దేవేన్ చవాన్ వెల్లడించారు. భోజ్ పురి నటి, మోడల్, ఏజెంట్ ముగ్గురూ కలిసి ఈ దందా నడుపుతున్నారని.. ఒక్కో కస్టమర్ నుంచి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారని సమాచారం అందిందని అన్నారు.
సమాచారం పక్కా అని నిర్ధారించుకున్నాక.. ఒక డమ్మీ కస్టమర్ ని అక్కడకు పంపించామని అన్నారు. ఏజెంట్ ని డమ్మీ కస్టమర్ కాంటాక్ట్ అయ్యాడని.. అతను నటి, మోడల్ ఫోటోలను పంపించాడని.. ఆ తర్వాత హోటల్ రూమ్ బుక్ చేశాడని అన్నారు. హోటల్ రూమ్ కి వెళ్లిన డమ్మీ కస్టమర్ ని పోలీసులు అనుసరించారు. అనంతరం నటిని, మోడల్, ఏజెంట్లను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముగ్గురూ మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.