‘పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్’ అలియాస్ అభిమానుల గాడ్. ‘సెప్టెంబర్ 2’ ఇప్పటికే పండగ జరుగుతోంది. ఆ పండగకి మరింత జోష్ యాడ్ చేసేందుకు భీమ్లానాయక్ వచ్చేశాడు. మొదటి నుంచి కమ్యూనిజం, సమాజం పట్ల పవన్ కల్యాణ్‌కి ఉండే ఆలోచనలు ఆయన సినిమాల్లో అందులో ఉండే పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది. ర్యాప్, పాప్ కంటే జానపద బాణీలకే ఆయన సినిమాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమాలో ఈ పందానే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ పాట లిరిక్స్ అన్నీ భీమ్లా నాయక్ ఎక్కడ, ఎలా జన్మించాడు అన్న విషయాన్ని పాట రూపంలో చెప్పారు రామజోగయ్య శాస్త్రి. భీమ్లానాయక్ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ చూస్తే అదే అర్థమవుతోంది.
సెభాష్, ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు గుర్రంనీళ్లా గుట్టాకాడ అంటూ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ఎస్.తమన్ సంగీతం ఈ పాటకు హైలెట్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, బిజీమేనన్ పాత్రల్లో పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా అలరించబోతున్నారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లేని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ఎస్.తమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం భీమ్లానాయక్ ఫస్ట్ సింగిల్ యూట్యూబ్, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మరి, మీరూ ఓ లుక్ వేసేయండి.
From the Terrain Trance of #BhemlaNayakMusic it’s his Jungle let’s all Shout it Loud for Our #Leader Shri @PawanKalyan Gaaru ♥️ #HBDPawanKalyan
My love & Respect to dear #Trivikram Gaaru ✊#BheemlaNayakFirstSingle IS HERE TO RULE 🎵
VOLUME UP 🎧🎵🧨https://t.co/vCZc1av7cm
— thaman S (@MusicThaman) September 2, 2021