బండ్ల గణేష్‌కు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులున్నారు. తొలుత కమెడియన్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్.. ఆ తర్వాత నిర్మాతయ్యారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు. యన స్పీచ్‌లు, ఇంటర్వ్యూలు చాలా ఫేమస్.. తాజాగా
సినిమా పరిశ్రమలో హాట్ కామెంట్స్ చేస్తూ, ఉన్నదీ ఉన్నట్లు కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడతారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈ విషయం పరిశ్రమలో ఉన్నవారికే కాదూ.. ఆయన స్పీచ్‌లు, ఇంటర్వ్యూలు చూసిన వారికి ఇట్టే అర్థమౌతుంది. బండ్ల గణేష్‌కు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులున్నారు. తొలుత కమెడియన్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్.. ఆ తర్వాత నిర్మాతయ్యారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు. వీటిలో అనేక సినిమాలు భారీ హిట్లు సాధించాయి. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానినని చెప్పుకునే ఆయన.. వీలు కుదిరినప్పుడల్లా పవర్ స్టార్ పై ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాడు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన టికెట్ దక్కకపోవడంతో తిరిగి సినీ పరిశ్రమలోకి వచ్చి.. నటుడిగా మారారు.
మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరునేకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ తర్వాత సన్ ఆప్ ఇండియా వంటి సినిమాల్లో కనిపించారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసే బండ్ల గణేష్.. ఈ సారి ఓ స్టార్ డైరెక్టర్ ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. ఓ ట్విట్టర్ యూజర్.. ‘అన్నా నాకు నిర్మాత కావాలని ఉంది’అని అడిగితే.. ‘గురూజీని కలవండీ.. భారీ గిఫ్ట్ ఇవ్వండి. అలా చేస్తే మీ కోరిక నెరవేరుతుంది’ అని గణేష్ రిప్లై ఇచ్చారు. ‘గురూజీకి కథ చెబితే స్ర్కీన్ ప్లే రాసి దాని తగ్గట్లుగా మళ్లీ కథను మార్చి అనుకున్న కథను షెడ్‌కు పంపిస్తారన్న టాక్ ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేయగా.. ‘అదే కాదూ.. భార్యాభర్తల్ని, తండ్రి, కొడుకుల్ని, గురు శిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు. అనుకుంటే అదీ మన గురూజీ స్పెషాలిటీ’అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై పాజిటివ్, నెగిటివ్ గా స్పందిస్తున్నారు నెటిజన్లు.
అయితే సినిమా ఇండస్ట్రీలో గురూజీ అనేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. ఆయనను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని యూజర్లు భావిస్తున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ పై కొన్ని నెలలుగా గుర్రుగా ఉన్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ బాండింగ్ వల్ల బండ్ల గణేష్ దూరంగా ఉండాల్సి వస్తోందని ఇండస్ట్రీ టాక్. దీనికి త్రివిక్రమ్ కారణమని భావిస్తున్న బండ్ల.. భీమ్లా నాయక్ ఈవెంట్ సమయంలో లీకైన వ్యాఖ్యలు ఈ వార్తకు ఆజ్యం పోశాయి. తనను త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడని, తనను కావాలనే ఈవెంట్లకు పిలవడం లేదని బండ్ల గణేష్ మాటలు లీక్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆ ఆడియో తనది కాదన్న బండ్ల.. తర్వాత తనవేనని అంగీకకరించాడు. త్రివిక్రమ్‌ను తిట్టానని ఒప్పుకున్నారు. ఇలా బండ్ల గణేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అందరికీ మరోసారి అర్థమైంది. ట్విట్టర్‌లో బండ్ల గణేష్ అప్పుడప్పుడు గురూజీ అంటూ కౌంటర్లు వేస్తుంటాడు. చివరకు దీనిపై త్రివిక్రమ్ ఏం స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023