తన అందం, నటనతో టాలీవుడ్ లో దూసుకెళ్తోంది ఓ బ్యూటీ. వరుస హిట్స్ తో మేకర్స్ కు లక్కీ ఛాయిస్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. కేరళ కుట్టి సంయుక్తా మీనన్.
చిత్ర సీమలో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ హీరోయిన్స్ కు ఉండదు. పైగా కెరీర్ తొలి రోజుల్లోనే ప్లాప్ వచ్చింది అనుకోండి.. ఇక ఆ హీరోయిన్ పని అయిపోయినట్లే లెక్క. అయితే కొంత మంది హీరోయిన్స్ నటనను నమ్ముకుని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మరికొంత మంది ముద్దుగుమ్మలు గ్లామర్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కానీ తాజాగా ఓ బ్యూటీ మాత్రం తన అందం, నటనతో టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. వరుస హిట్స్ తో మేకర్స్ కు లక్కీ ఛాయిస్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. కేరళ కుట్టి సంయుక్తా మీనన్. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. దాంతో గొల్డెన్ లెగ్ అన్న బిరుదును కూడా ఈ అమ్మడు పొందింది. దాంతో సంయుక్త పాప ఉంటే హిట్ పక్కా అని అంటున్నారు నెటిజన్లు.
సంయుక్తా మీనన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సంయుక్త పాత్రకు ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రంతో మరో సూపర్ హిట్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన విజయపరంపరను ఇంతటితో ఆపలేదు ఈ వయ్యారి. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ‘సార్’ మూవీలో టీచరమ్మగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. మాస్టారూ మాస్టారూ అంటూ.. కుర్రకారు హృదయాలకు పాఠాలు నేర్పింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో.. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది సంయుక్తా..
తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ సోయగం. విరూపాక్షతో మంచి సక్సెస్ ను అందుకుంది సంయుక్తా మీనన్. మిగతా మూడు చిత్రాల్లో కంటే విరూపాక్షలో తన నటవిశ్వరూపాన్ని చూపింది సంయుక్తా. దాంతో సినిమాలో సంయుక్త పాప ఉంటే హిట్ పక్కా అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వరుసగా నాలుగు హిట్లు అంటే మామూలు విషయం కాదు. దాంతో గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు సంయుక్తను. అయితే కథల ఎంపికలోనూ సంయుక్తా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటోంది. సెలెక్టీవ్ కథలతో ముందుకు వెళ్తోంది. ఇక సంయుక్త వరుస విజయాలపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడుకి అదృష్టం బాగా కలిసి వస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సంయుక్తా మీనన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.