టాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ విషయంలో హీరో - రైటర్, డైరెక్టర్ మధ్య వివాదం జరుగుతుందనే న్యూస్ ఫిలిం వర్గాల వారితో పాటు మీడియా, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ విషయంలో హీరో – రైటర్, డైరెక్టర్ మధ్య వివాదం జరుగుతుందనే న్యూస్ ఫిలిం వర్గాల వారితో పాటు మీడియా, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. దర్శకుడు గుణ శేఖర్ భారీ చిత్రాల్లో సెట్స్ పరంగా ఎంతటి భారీతనం ఉంటుందో తెలిసిందే. ‘రుద్రమదేవి’, ‘శాకుంతలం’ వంటి హిస్టారికల్ ఫిలింస్ తెరకెక్కించిన ఆయన ఎప్పటినుండో అమర చిత్ర కథల ఆధారంగా రాక్షసరాజు ‘హిరణ్యకశ్యప’ మీద సినిమా చెయ్యాలనుకుంటున్నారు. ఆ కథపై దాదాపు 5 సంవత్సరాలు వర్క్ చేశారు. రానా దగ్గుబాటి హీరో, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం అని అప్పట్లో అన్నారు. కట్ చేస్తే ఏం జరిగిందో తెలియదు కానీ ‘కామిన్ కాన్ – 2023’ ఈవెంట్‌లో రానా ‘హిరణ్యకశ్యప్’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ ఎవరనేది రివీల్ చెయ్యలేదు. రానా సొంత సంస్థ స్పిరిట్ మీడియా రానా కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహించనుంది. ఇదిలా ఉంటే రానాతో ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ చేయనున్నట్లు గతంలో గుణ శేఖర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఆయన్ని వెయిట్ చేయించి ఇప్పుడు తనకు తెలియకుండా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో హర్ట్ అయిన గుణ శేఖర్ పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఓ పోస్ట్ చేశారు. ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో గల అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
‘‘దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా తీసుకుని చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది’’ అంటూ పోస్ట్ చేశారు. రానా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన టైంలోనే ఆయనిలా పోస్ట్ చేయడంతో ఈ కామెంట్స్ రానా గురించేనని ప్రచారం జరుగుతోంది. ఇక ‘శాకుంతలం’ ప్రమోషన్లలో ‘హిరణ్యకశ్యప’ గురించి పలు వ్యాఖ్యలు చేశారు గుణ శేఖర్. ‘‘నేను ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ మీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చేస్తే మీరు చెయ్యాలి లేదంటే తప్పుకోవాలి. కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను. అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే వెనక్కు తగ్గను’’ అంటూ హెచ్చరించినట్లే చెప్పారు. అలాగే ‘హిరణ్యకశ్యప’ స్క్రిప్ట్ రెండేళ్ల పాటు తయారు చేసి, మూడేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశానని.. పాండమిక్ వల్ల కాస్త హోల్డ్‌లో ఉందని చెప్తూ.. ‘కంప్లీట్‌గా ఇది నా ప్రాజెక్ట్. నాతో ఎవరు టైఅప్ అవుతారో త్వరలో చెప్తాను’ అంటూ రానా – సురేష్ ప్రొడక్షన్ పేర్లు కూడా చెప్పలేదు గుణ శేఖర్.
#HiranyaKashyapa ప్రాజెక్ట్ నాది. నాతో ఎవరు టయప్ అవుతారో త్వరలోనే చెప్తాను – @Gunasekhar1 #HiranyaKashyap pic.twitter.com/C5NzI6ucj5
— Rajesh Manne (@rajeshmanne1) July 19, 2023