ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే చాలు సీక్వెల్ ఎలా ప్లాన్ చేయబోతున్నారు, ఏంటి విషయం అనే చాలా అంచనాలు ఏర్పడతాయి. అభిమానులు కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెట్టుకుంటారు. మూవీ టీమ్ దాన్ని అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకు తగ్గట్లే రికార్డ్స్ సెట్ చేస్తుంది కూడా. ఇక బాలయ్య విషయానికొస్తే.. హీరోగా సూపర్ సక్సెస్ అయిన ఆయన.. ‘అన్ స్టాపబుల్’ షోతో అంతకు మించి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు రెండో సీజన్ లోనూ దుమ్ములేపుతున్నారు. ప్రస్తుతం ఆ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరో బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ సినిమాలు, అదిరిపోయే ఫైట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ తరహా మూవీస్ ఎక్కువగా చేస్తూ వచ్చాడు. కానీ బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ని పరిచయం చేసింది మాత్రం ‘అన్ స్టాపబుల్’ టాక్ షో. అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో గానీ నిజంగా వాళ్లని ప్రశంసించాలి. గతేడాది ఇదే టైంలో ఓటీటీలో రిలీజైన ప్రతి ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ అయింది. బాలయ్య రేంజ్ ని అమాంతం పెంచేసింది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా రెండో సీజన్ కోసం ఎదురుచూశారు.
ఇక ఐదు వారాల క్రితం ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ గ్రాండ్ గా స్టార్టయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ గెస్టులుగా వచ్చారు. స్వయానా వియ్యంకులు అయిన బాలయ్య-చంద్రబాబు పాల్గొన్న ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత యంగ్ హీరోస్ విశ్వక్ సేన్-సిద్ధు జొన్నాలగడ్డ వచ్చారు. మూడో వారం.. తొలి ఎపిసోడ్ సెన్సార్ అవ్వని కట్ ని అప్ లోడ్ చేశాడు. నాలుగో వారం యంగ్ హీరోస్ శర్వానంద్-అడివి శేష్ వచ్చారు. బాలయ్యతో కలిసి ఫుల్ ఎంటర్ టైన్ చేశారు.
ఇక షో విషయానికొస్తే.. ఫస్ట్ సీజన్ కంటే బాలయ్య చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు. వచ్చిన గెస్టు సీనియర్ అయితే సీనియర్ లా, యంగ్ హీరోస్ అయితే యంగ్ హీరోలా, చెప్పాలంటే వాళ్లలో ఒకడిలా కలిసిపోతున్నారు. ప్రేక్షకులకు ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. మరోవైపు ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ లో వైఎస్ షర్మిల కనిపిస్తారనే టాక్ కూడా వినిపించింది. ఈసారి లాస్ట్ ఎపిసోడ్ కి స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. ఏదేమైనా సరే తొలి సీజన్ అంత అద్భుతంగా చేసి.. రెండో సీజన్ లో అంతకంటే అద్భుతంగా సాగుతోంది. మరి అన్ స్టాపబుల్ రెండో సీజన్ షోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.