అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రీసెంట్ గా వీరసింహారెడ్డి మూవీతో మరో విజయాన్ని అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మాస్ యాక్షన్ మూవీగా విడుదలైన వీరసింహారెడ్డి.. వింటేజ్ బాలయ్యని గుర్తు చేయడమే కాకుండా మాస్ డైలాగ్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. వెరసి.. బాలయ్య కెరీర్ లోనే రూ. 54 కోట్ల ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ నెంబర్ నమోదు చేసింది. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో రూ. 100 కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. ప్రస్తుతం బాలయ్య, వీరసింహారెడ్డి టీమ్ అంతా మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక వీరసింహారెడ్డి మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మించగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఇదిలా ఉండగా.. సినిమా వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, ఫ్యాన్స్ అయినా హెల్ప్ చేయడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాకి తనవంతు హెల్ప్ చేయనున్నాడు. హీరో సినిమాకి హెల్ప్ ఏంటి అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళ్తే.. సందీప్ కిషన్ హీరోగా ‘మైఖేల్’ అనే యాక్షన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అనసూయ, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మీ, గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు.
డైరెక్టర్ రంజిత్ జేకొడి రూపొందించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్స్ ని ప్రారంభించారు మేకర్స్. కాగా.. జనవరి 23న ట్రైలర్ రిలీజ్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని నటసింహం బాలయ్య చేతుల మీదుగా లాంచ్ చేస్తుండటం విశేషం. ఆల్రెడీ టీజర్ తో ఆసక్తిరేపిన మైఖేల్ మూవీ ట్రైలర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకి ఖైదీ ఫేమ్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి బాలయ్య చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అంటే.. మామూలుగా ఉండదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి సందీప్ కిషన్ మైఖేల్ మూవీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.
#Michael Theatrical Trialer on Monday (January 23rd)
with the
Blessings of BalaKrishna Garu ♥️#Telugu #MichaelOnFeb3rd pic.twitter.com/QwgStFbiOq— Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) January 21, 2023