ప్రపంచ సినీ చరిత్రలో ‘అవతార్’ మూవీ క్రేజ్ వేరు. 2009లో అవతార్ సినిమాతో ప్రేక్షకులకు మరో అద్బుత ప్రపంచానికి తీసుకెళ్లాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. గ్లోబల్ బాక్సాపీస్ నిఈ సినిమా ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో అవతార్ ముందే ఉంటుంది. ఇప్పుడు అవతార్ 2తో ప్రేక్షకులను మరోసారి అద్భుత సృష్టిలోకి తీసుకెళ్లేందుకు రెడీ అయిపోయాడు జేమ్స్ కామెరాన్.
అవతార్ విడుదలైన 12 ఏళ్ళ తర్వాత.. అవతార్ 2 రిలీజ్ కాబోతుంది. తాజాగా అవతార్ 2 టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ మూవీ 2022 డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుంది. అదీగాక వరల్డ్ వైడ్ 160 భాషల్లో రిలీజ్ అవుతుండటం విశేషం. 3డీ, 4డీఎక్స్, ఐమాక్స్, డాల్బీ విజన్, పీఎల్ఎఫ్ తోపాటు ఇతర ఫార్మాట్లలో అవతార్ 2 సందడి చేయబోతుంది.
ఇప్పుడు రిలీజైన అవతార్ 2 టీజర్ ట్రైలర్ విజువల్ వండర్ అనే చెప్పాలి. పండోర గ్రహంలో జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాలు క్రియేట్ చేయనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను ఇటీవల విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. మరి అవతార్ 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
“Wherever we go, this family is our fortress.”
Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4
— Avatar (@officialavatar) May 9, 2022