ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ కటౌట్ తగ్గ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంచనాల్ని పెంచే విధంగా ఉన్నాయి. కానీ ఓ విషయం మాత్రం కీలకంగా మారింది.
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. గ్రాఫిక్స్ విషయంలో రావణుడిని చూపించే విషయంలో మూవీ టీమ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. డైరెక్టర్ ఓం రౌత్ ని రకరకాల పేర్లతో పిలుస్తూ విమర్శించారు. అలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినవాళ్లు.. తాజాగా యూట్యూబ్ లో విడుదలైన ట్రైలర్ చూసి వావ్ అంటున్నారు. ఆ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇంకా మైండ్ లోనే తిరుగుతోందంటే మీరు అర్ధం చేసుకోవచ్చు ట్రైలర్ ఎంత బాగుందనేది..!
అసలు విషయానికొస్తే.. ‘ఆదిపురుష్’ని హనుమంతుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పబోతున్నారు. ట్రైలర్ అందుకు తగ్గట్లే స్టార్ట్ చేశారు. హనుమంతుడి పాత్ర.. ఆ తర్వాత రాఘవ్ గా ప్రభాస్, జానకిగా సీత ఇలా ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్లారు. రామాయణం మనం చిన్నప్పటి నుంచి చూస్తూ, విన్నాం కాబట్టి స్టోరీ పరంగా కొత్తగా ఏం అనిపించదు. కానీ ‘ఆదిపురుష్’లో కొత్తగా బాగున్నది అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి. జస్ట్ 3:19 నిమిషాల ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించిందంటే.. సినిమా మొత్తం ఎలా ఉంటుందా అనే ఎగ్జైట్ మెంట్ కలుగుతోంది. అదే టైంలో క్లైమాక్స్ ఫైట్ ని కూడా కాస్త చూపించి అంచనాల్ని పెంచేశారు. మరి ‘ఆదిపురుష్’ ట్రైలర్ చూడగానే మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.