పోస్టర్, టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నరేష్.. తన కొత్త మూవీ 'మళ్లీ పెళ్లి' నుంచి మరో సర్ ప్రైజ్ తీసుకొచ్చాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి.. అందరికీ షాకిచ్చాడు.
తెలుగులో ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా క్యూరియాసిటీ పెంచిన మూవీ ‘మళ్లీ పెళ్లి’. నరేష్-పవిత్రా లోకేష్ వ్యవహారం తెలిసిన వాళ్లయితే ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటివరకు న్యూస్ లో ఈ విషయాన్ని పార్ట్స్ పార్ట్ గా చూశారు. ఇప్పుడు వీటన్నింటినీ బిగ్ స్క్రీన్ పై ఓ చిత్రంగా చూడబోతున్నారనే విషయం వెరీ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. దీనికితోడు మరింత ఆసక్తి పెరిగేలా తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో పలు సీన్స్, డైలాగ్స్ ఎక్కడలేని డౌట్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయనిర్మల కొడుకుగా నరేష్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయాడు. పవిత్రా లోకేష్ తో ఉంటున్నాడని వార్తలొచ్చాయి. అది అందరూ నిజమనుకునేలోపు ‘మళ్లీ పెళ్లి’ మూవీ కోసం ఈ సందడంతా అని తెలిసింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో నరేష్-పవిత్ర రిలేషన్ తోపాటు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి వ్యవహారాలని చూపించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది. ట్రైలర్ చూస్తుంటేనే కాస్త సినిమా అర్థమైపోతునట్లు అనిపించింది. మరి ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.