ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్. ఇప్పటికే 'ఆదిపురుష్' పాటలు, ట్రైలర్ అలరిస్తుండగా.. త్వరలో మరో క్రేజీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
డార్లింగ్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో దేనికోసం వెయిట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ని అడిగితే మొన్నటివరకు ‘సలార్’ పేరు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ‘ఆదిపురుష్’ లైన్ లోకి వచ్చింది. ట్రైలర్ తోపాటు రీసెంట్ గా రిలీజైన సాంగ్స్.. హైప్ ని పెంచేస్తున్నాయి. దీంతో మూవీ మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఓ ప్లాన్ కూడా రెడీ చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? ఎప్పుడు రివీల్ చేయనున్నారు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సెప్టెంబరులో ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. కట్ చేస్తే ఘోరంగా ట్రోల్ చేశాడు. ఆ గ్రాఫిక్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్, డైరెక్టర్ ని తిట్టుకున్నారు. దీంతో సంక్రాంతికి థియేటర్లలోకి వస్తుందనుకున్న సినిమా వాయిదా పడింది. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. అందుకు తగ్గట్లే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పాటలు, ట్రైలర్ ని కొన్నిరోజుల ముందు యూట్యూబ్ లో పెట్టారు. వీటి వల్ల నెగిటివ్ కాస్త అంతా పాజిటివ్ అయిపోయింది.
ఈ క్రమంలోనే జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి చీఫ్ గెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళి రానున్నారని తెలుస్తోంది. అలానే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేందుకు అదే రోజు మరో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయాలని ‘ఆదిపురుష్’ టీమ్ భావిస్తోంది. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని, త్వరలో క్లారిటీ వచ్చేస్తుందని అంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ‘ఆదిపురుష్’ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని మీరు అంచనా వేస్తున్నారు. కింద కామెంట్ చేయండి.