‘ఆదిపురుష్’ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పారు. ‘ఆదిపురుష్’ చిత్రంతో బాధించినందుకు దేశ ప్రజలకు సారీ చెప్తూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టారాయన.
మొదటి నుంచి ఆదిపురుష్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలోని రావణుడి పాత్ర గెటప్ ను తప్పుగా చూపించారని.. రామాయణంలో లేని వాటిని సినిమాలో చూపించారని.. కొన్ని సంభాషణలు అయితే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. రామాయణాన్ని సరిగా చూపించలేదని కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మేకర్స్ తీరును తప్పుబట్టింది.
ఓం రౌనత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ప్రధాన పాత్రల డిజైన్ విషయంలో దర్శకుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
హాలీవుడ్ సినిమాల ప్రభావం మన మేకర్స్ మీద ఉంటుంది. అందుకే కొన్ని సీన్స్ నచ్చితే వాటిని తమ సినిమాల్లో కాస్త మార్చి తీస్తుంటారు. అయితే ఒకప్పుడు కాపీ చేసినా పెద్ద తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జనం బాగా అప్ డేట్ అయ్యారు. ఏ సినిమా చూసినా ఏ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారో వెంటనే బయట పెట్టేస్తున్నారు. తహగా ఆదిపురుష్ సినిమాని ఏ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టారో అనే విషయాన్ని వీడియోల రూపంలో పెట్టి విమర్శలు చేస్తున్నారు.
ఆదిపురుష్’.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ.. తన ఫస్ట్ ఫిలిం, అజయ్ దేవ్‌గణ్ 100వ సినిమా ‘తాన్హాజీ’ (ది అన్‌సంగ్ వారియర్) తీసి ప్రశంసలందుకున్న యంగ్ డైరెక్టర్ ఓం రౌత్, అందరికీ తెలిసిన వాల్మీకీ రామాయణానికి తన వెర్షన్‌లో వెండితెర రూపం ఇవ్వాలనుకున్నాడు..
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విషయంలో ఫ్యాన్స్, నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓం రౌత్ ని ప్రభాస్ డైలాగ్ తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’ టీజర్ పై అప్పట్లో భారీ ట్రోల్స్ వచ్చాయి. మార్పు చేర్పులు చేశామంటూ ట్రైలర్‌ను వదిలితే దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం.. మేకర్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని. అదే నిజమని తేలింది. ఇవాళ విడుదలైన ఆ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. టీజర్‌పై వచ్చిన మాదిరిగానే దర్శకుడు ఓం రౌత్ మీద నెట్టింట మరోమారు భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడకు హనుమంతుడు వస్తారని చెబుతారు. అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా చూసేందుకు సాక్షాత్తు హనుమంతుల వారే థియేటర్ కి వచ్చారని నెటిజన్లు ఓ వీడియోని షేర్ చేస్తున్నారు.
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది? సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఏమంటున్నారో ట్విట్టర్ రివ్యూ చూడండి.
నటి కస్తూరి ఆదిపురుష్ సినిమా పోస్టర్లపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీరాముడి, లక్ష్మణుడికి మీసాలు, గడ్డలతో ఎందుకు చూపించారని ఆమె ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.