‘ఆదిపురుష్’ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పారు. ‘ఆదిపురుష్’ చిత్రంతో బాధించినందుకు దేశ ప్రజలకు సారీ చెప్తూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టారాయన.
‘ఆదిపురుష్’ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పారు. ‘ఆదిపురుష్’ చిత్రంతో బాధించినందుకు దేశ ప్రజలకు సారీ చెప్తూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టారాయన. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని రాముడిగా చూపిస్తూ.. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ పెద్ద ప్రణాళిక వేసుకున్నాడు. టీజర్‌తో విమర్శలు ఎదుర్కొని, ట్రైలర్‌తో అంచనాలు పెంచేశాడు. తీరా సినిమా విడుదలయ్యాక అందరికీ షాక్ ఇచ్చాడు. కథ, కథనాల సంగతి పక్కన పెడితే పాత్రలను తీర్చిదిద్దిన విధానం భారతీయ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బ తీసింది. సినిమా ఆపెయ్యాలంటూ కోర్టుని ఆశ్రయించగా.. వారం తర్వాత డైలాగులు మార్చారు.
డైరెక్టర్, రైటర్ కలిసి అసలు రామాయణానికి, ఈ చిత్రానికి సంబంధమే లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయినట్లే. తాజాగా రైటర్ మనోజ్ స్పందించారు. ‘ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు భజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక’ అంటూ పోస్ట్ చేశారు.
జూన్ 16న భారీ అంచనాలతో వచ్చిన ‘ఆదిపురుష్’ తీవ్రంగా నిరాశ పరిచింది. క్యారెక్టర్స్, డైలాగ్స్, గ్రాఫిక్స్, సంబంధం లేని సీన్స్.. ఇలా ప్రతి విషయంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఈ సినిమా దర్శక నిర్మాతలకు అలహాబాద్ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఈనెల 27న నిర్మాత భూషణ్ కుమార్, డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా, లేదా అనే విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే.
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023