మన దేశ టెలివిజన్ చరిత్రలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ‘రామాయణం’ సీరియల్ మళ్లీ టెలికాస్ట్ కానుంది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఈ సీరియల్ రీ టెలికాస్ట్ అయ్యేది ఎప్పటి నుంచంటే..!
డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదలైన విమర్శలు.. సినిమా విడుదలై రెండు వారాలైనా ఇంకా కొనసాగుతున్నాయి. ‘ఆదిపురుష్’లో డైలాగులు, పాత్రల వేషధారణలపై ఎన్నో విమర్శలు వినిపించాయి. మూవీ డైరెక్టర్ ఓం రౌత్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఆయనకు అసలు రామాయణం గురించి ఏమీ తెలియదని నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అతడ్ని భారీగా ట్రోల్ చేశారు. రామాయణంపై సినిమా అంటూ ‘ఆదిపురుష్’ను రౌత్ చెడగొట్టాడని దుయ్యబట్టారు. రామాయణంపై ఫిలిం తీయాలనుకునేవారు ముందు దాని ఆధారంగా రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్‌ను ఒకసారి చూడాల్సిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత ఆ ఫిలింలోని క్యారెక్టర్లను రామాయణం సీరియల్లోని పాత్రలతో పోలుస్తూ నెట్టింట భారీగా పోస్టులు వెల్లువెత్తాయి. రామాయణం సీరియల్‌ను మరోసారి టెలికాస్ట్ చేయాలని కోరుతూ నెజటిన్స్ కామెంట్స్ చేశారు. దీంతో షెమారూ టీవీ ఛానల్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 3వ తేదీ నుంచి రామాయణం సీరియల్‌ను రీ టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేస్తామని షిమారూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ఎందుకో తెలియదు గానీ, ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ ఛానల్ ఈ పోస్ట్‌ను తొలగించింది. రామానంద్ సాగర్ తీసిన రామాయణంలో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా యాక్ట్ చేశారు. కాగా, ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్‌తోనే ఈ సీరియల్‌ను మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారని సమాచారం. మరి.. రీ టెలికాస్ట్ కానున్న రామాయణం సీరియల్‌ను చూసేందుకు మీరు ఎదురుచూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.