తెలుగు తెరపై స్టార్ హీరోలకి కొదవ ఉండదు. ఎటొచ్చి హీరోయిన్స్ షార్టేజ్ మాత్రం ఎప్పుడు ఉంటూనే వస్తోంది. నిన్న మొన్నటి వరకు సమంతా, కాజల్, తమన్నా వంటి వారు టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ గా చెలామణి అవుతూ వచ్చారు. కానీ.., ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, రష్మికా మందన్న మాత్రమే మిగిలారు. ముఖ్యంగా రష్మిక తెలుగులో స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయస్ గా మారింది. కెరీర్ ఇలా పీక్స్ లో ఉండగానే రష్మిక ఇప్పుడు పెళ్లి ప్రస్తావన ఎత్తడం హాట్ టాపిక్ గా మారింది. 2008లో తెలుగునాట విడుదలైన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కి దగ్గరైంది రష్మిక.. తరువాత కాలంలో చేసిన గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్స్ ఈ కన్నడ కుమారికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. రష్మిక ప్రస్తుతం సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యే కార్తీ సరసన సుల్తాన్ మూవీలో నటించి.. తమిళంలోను ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన సినిమాల అప్డేట్స్ ఇవ్వడం రష్మికకి అలవాటు. కానీ.., ఈసారి మాత్రం కాస్త విచిత్రంగా తన లైఫ్ డెస్టినేషన్ గురించి ఓపెన్ అయ్యింది ఈ అమ్మడు. తాను పెళ్లంటూ చేసుకుంటే తమిళ అబ్బాయినే చేసుకుంటానని చెప్తోంది రష్మిక. అదేంటీ..? కర్నాటక బ్యూటీకి తమిళనాడుపై ఎందుకంత మోజు అంటారా? ఆమెకు అక్కడి ప్రజలు, వారి సంప్రదాయం కూడా ఆమెను బాగా ఆకర్షించాయట. అన్నిటికీ మించి తమిళ వంటలంటే ఈ కన్నడ భామకి చాలా ఇష్టమట. అందుకే.. ఎప్పటికైనా తమిళనాడు వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందని తెలియచేసింది రష్మిక, ఇక తాజాగా తమిళంలో విడుదలైన సుల్తాన్ విజయాన్ని అందుకోకపోయినా.., రష్మికకి మాత్రం మంచి పేరే దక్కింది. మరి.., అక్కడ మరిన్ని అవకాశాల కోసమే మందాన్న మేడమ్ ఈ కామెంట్స్ చేసిందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.