ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఎంగేజ్మెంట్స్, పెళ్లి వార్తలన్నీ నెటిజెన్స్, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే విధంగా జరుగుతున్నాయి. నిన్నటివరకూ తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన మేఘన.. త్వరలోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది. యాంకర్ గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన మేఘన త్వరలో మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లాడబోతుంది. ఏంటి యాంకర్ మేఘన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. ఆల్రెడీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురువారం జరిగింది.
ఇక పవన్ తేజ్, మేఘనల నిశ్చితార్థానికి చిరంజీవి భార్య సురేఖ హాజరయ్యారు. అలాగే కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యామిలీ హీరోతో మేఘనకి పరిచయం ఎలా అయ్యింది? లవ్ లో ఎప్పుడు పడ్డారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అందరికి యాంకర్ గా మాత్రమే తెలిసిన మేఘన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటనే దిశగా వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్స్.
యాంకర్ మేఘన స్వస్థలం కాకినాడ అని.. ఆమె తండ్రి పోలీసు శాఖలో పనిచేస్తారని తెలుస్తుంది. మేఘన బాల్యం కాకినాడలో పూర్తవగా.. ఆ తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిందట. కాలేజీ సమయంలో ఈవెంట్స్‌కి యాంకరింగ్ చేస్తూ.. సినిమాల మీద ఆసక్తితో ఆ దిశగా ప్రయత్నాలు చేసిందని సమాచారం. మేఘన ‘హెచ్‌బీడీ’ చిత్రం ద్వారా నటిగా డెబ్యూ చేసింది. ఆ తర్వాత 2021లో మెగా హీరో పవన్ తేజ్‌కు జోడిగా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాలో నటించింది.
ఆ సినిమా టైంలోనే పవన్ తో మేఘన ప్రేమలో పడిందట. ఒకరికొకరు నచ్చడంతో.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించారని తెలుస్తుంది. ఇక కొణిదెల పవన్ తేజ్‌కు… చిరంజీవి బాబాయ్ అవుతారట. ఇదిలా ఉండగా.. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ మెగా జంట ఎంగేజ్మెంట్ లో డైరెక్టర్ మెహర్ రమేష్ తో పాటు యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నారు. యాంకర్ సుమ ఉంటే ఆ సందడి ఎలా ఉంటుందో తెలిసిందేగా.. ప్రస్తుతం పవన్ తేజ్, మేఘనల ఎంగేజ్మెంట్ లో సుమ, రాజీవ్ ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి కాబోయే మెగా కోడలు యాంకర్ మేఘన ఎంగేజ్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.