సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ కాబోయే సినిమాలకు సంబంధించి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. స్టార్ హీరోల సినిమాల మేకింగ్ వీడియోలకంటే చిన్న సినిమాల మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మేకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రష్మీ, నందుల మధ్య ఓ సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీన్ లో నందు, రష్మీ ఇద్దరూ యాక్టింగ్ లో లీనమైపోయి కనిపించారు. అయితే.. యాంకర్ రష్మీ ఈ స్థాయి రావడానికి ఎంత కష్టపడిందో అందరికి తెలుసు. ఓవైపు టీవీ యాంకర్ గా, మరోవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న రష్మీ.. షూటింగ్స్ లో చాలా కష్టపడటం మనం చూస్తుంటాం. తాజాగా ఈ సీన్ విషయంలో కూడా రష్మీ పడుతున్న కష్టాన్ని మనం చూడవచ్చు. యాక్టింగ్ అనేది ఈజీ అనుకునేవారికి ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోంది.
రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు లేదా సెంటిమెంట్, సాంగ్స్.. ఇలా ఏ సన్నివేశమైనా నటీనటులు పడే కష్టం మామూలుగా ఉండదు. ముఖ్యంగా యాంకర్ రష్మీ తన సినిమాలలో ఎంతో డెప్త్ గా నటిస్తుంటుంది. ఇప్పుడీ మేకింగ్ వీడియో చూస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో కూడా ఎంతో చక్కగా చీరకట్టులో కనిపిస్తోంది.