పాత సంవత్సరం వెళ్ళిపోయి.. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పార్టీ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు? ఇయర్ ఎండ్ ని, న్యూ ఇయర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. గతంలో అంటే.. ఏమి తెలిసేది కాదేమో! ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా! ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ కి అప్ డేట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో 2022కి ముగింపు పలుకుతూ.. కొత్త ఏడాదిలో అడుగు పెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు.
ఇక తెలుగు బుల్లితెర సెలబ్రిటీలైతే.. ఓవైపు న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ లో పాల్గొంటూనే.. మరోవైపు పర్సనల్ గా ఫ్రెండ్స్ తో పార్టీలు స్టార్ట్ చేసేశారు. అదేంటీ.. ఇంకా కొన్ని గంటల టైమ్ ఉంది కదా అంటే.. గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ ఆల్రెడీ తనవైపు నుండి ఇయర్ ఎండింగ్ పార్టీ ప్రారంభించేసింది. అలాగే తనతో పాటు తనకు సన్నిహితులైన ఫ్రెండ్స్ ని కూడా పార్టీలో జాయిన్ చేసుకుందట. అయితే.. యాంకర్ రష్మీ ఎలాంటి పార్టీ చేసుకుంటుంది? మహా అయితే ఫ్రెండ్స్ తో పార్టీకి లేదా బయటికి వెళ్తుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడంతా అప్ డేట్ అయిపోయారు తెలుసు కదా.
యాంకర్ రష్మీ తన ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీ చేసుకుంటోంది. పైగా పార్టీ చేసుకుంటూ గ్లాస్ లో మందు పోసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మరి రష్మీ పోస్ట్ చేసిన పిక్స్ లో రెండు గ్లాస్ లు కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనంటే.. మరో గ్లామర్ బ్యూటీ దీపికా పిల్లి, వేరొక ఫ్రెండ్ ఉన్నట్లు సమాచారం. అవును.. ఢీ ప్రోగ్రామ్ నుండి రష్మీ, దీపికా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుండి రెగ్యులర్ గా ఏ స్పెషల్ ఈవెంట్స్, పార్టీస్ ఉన్నా కలిసి అటెండ్ అవుతుంటారు. ఆ మధ్య ఇద్దరు కలిసి గోవా కూడా వెళ్లి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మరి ప్రస్తుతం యాంకర్ రష్మీ మందు పార్టీకి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ రష్మీ ఇయర్ ఎండింగ్ పార్టీ గురించి, మీ ఇయర్ ఎండింగ్ ప్లానింగ్స్ గురించి కామెంట్స్ లో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 30, 2022