తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ జోడి అంటే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ అనే చెప్పాలి. వీరిద్దరూ జంటగా ఎక్కడ కనిపించినా అక్కడ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ. ముఖ్యంగా ఇద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలు, సుధీర్ ఫ్లర్ట్ చేసే విధానం, రష్మీ అవాయిడ్ చేయడం లాంటివన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్స్ గా సుధీర్ – రష్మీ చేసిన సందడి గురించి తెలిసిందే.
ఇక ఇద్దరూ ఢీ షో నుండి వెళ్లిపోయేసరికి సుధీర్ – రష్మీ అభిమానులు చాలా ఎంటర్టైన్ మెంట్ మిస్ అయ్యారు మళ్లీ సుధీర్, రష్మీల జంటను ఆన్ స్క్రీన్ లో ఎప్పుడు చూస్తామా.. అని ఎదురు చూస్తుండగా.. తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన హోలీ స్పెషల్ ‘తగ్గేదేలే’ అనే ప్రోగ్రాం కోసం సుధీర్ – రష్మీ మరోసారి జతకట్టారు. వీరిద్దరూ జంటగా కనిపించేసరికి ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.సాధారణంగా సుధీర్, రష్మీలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటెస్ట్ ఎపిసోడ్ లో సుధీర్ రష్మీ కోసం చాలానే లవ్ సాంగ్స్ పాడాడు. ఆ పాటలు విన్నాక ఫిదా అయిన రష్మీకి నోటమాట రాలేదు. ఈ క్రమంలో సుధీర్ తో రిలేషన్ పై రష్మీ ఓపెన్ అయింది. ఓ స్కిట్ విషయంలో సుధీర్ ని అపార్థం చేసుకున్నానని, ఆ తర్వాత రెండు రోజులపాటు మాట్లాడుకోలేదని చెప్పింది. తర్వాత ఓ రోజు షూటింగ్ లో నాకిష్టమైన స్వీట్ పంపించి కూల్ చేశాడు, ఇద్దరం ఏడ్చేసి హగ్ చేసుకున్నాం’ అని రష్మీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి సుధీర్ – రష్మీ జోడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.