స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో బాగానే సంపాదిస్తున్న సమంత అక్కినేని వ్యాపారంలోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే ఏకమ్ అనే ప్లే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా జ్యువెలరి బిజినెస్‌లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్స్‌లో ఇప్పటికే తమన్నా జ్యువెలరి బిజినెస్‌లోకి అడుగుపెట్టగా, సమంత కూడా గోల్డ్ బిజినెస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందట. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న శాకుంతలం సినిమాలో నటిస్తోంది.
అక్కినేని కోడలు అయిన తర్వాత ఎంచుకునే కథల్లో కొత్తదనం చూపిస్తుంది. 96 రీమేక్ ‘జాను’ పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రాలేదు. ప్రస్తుతం సమంత తెలుగు దర్శక ద్వయం రాజ్ డికే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ 2లో నటించింది సమంత. ఇప్పటికే సమంత అక్కినేని పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫుల్ బిజీగా మారిపోయింది. అలాగే రీసెంట్‌గా వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ సీజన్2లో సమంత పోషించిన ‘రాజీ’ అనే తమిళ టెర్రరిస్ట్ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.
‘ఫ్యాషన్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు వారి కోడలు త్వరలో ప్రారంభించబోయే జ్యువెలరి వ్యాపారాన్ని ఎంత వరకు ముందుకు నడిపిస్తుందో వేచి చూడాలి.