స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో బాగానే సంపాదిస్తున్న సమంత అక్కినేని వ్యాపారంలోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే ఏకమ్ అనే ప్లే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా జ్యువెలరి బిజినెస్‌లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్స్‌లో ఇప్పటికే తమన్నా జ్యువెలరి బిజినెస్‌లోకి అడుగుపెట్టగా, సమంత కూడా గోల్డ్ బిజినెస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందట. ఇక సినిమాల విషయానికి వస్తే […]