పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ పుష్ప 2తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ ఫ్యాన్స్ తో ఎంత టచ్ లో ఉంటాడో.. బన్నీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని ఆయన భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో తెలియజేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడు అయాన్ కి సంబంధించి ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది.
సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి విషయాలైనా ఫ్యాన్స్ కి ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలకు సంబంధించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ పుష్ప 2తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా.. బన్నీ ఫ్యాన్స్ తో ఎంత టచ్ లో ఉంటాడో.. బన్నీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని ఆయన భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో తెలియజేస్తూనే ఉంటారు.
ఈ క్రమంలో బన్నీ గురించే కాకుండా.. పిల్లలు అయాన్, అర్హల గురించి కూడా అప్ డేట్స్ ఇస్తుంటుంది స్నేహారెడ్డి. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే స్నేహ.. సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా టాప్ సెలబ్రిటీగా నిలిచింది. మోడలింగ్ తో పాటు ఇటు బన్నీకి భార్యగా, పిల్లలకు తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడు అయాన్ కి సంబంధించి ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది. క్రేజీ అని ఎందుకన్నానంటే.. ఆ పిక్ చూస్తే మీరు కూడా అలాగే అనుకుంటారు. బన్నీకి ఐకాన్ స్టార్ అనే పేరుకంటే ముందు స్టైలిష్ స్టార్ అనే పేరుందని తెలుసు కదా!
ఇప్పుడా పేరుని తనయుడు అయాన్ ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. స్నేహారెడ్డి షేర్ చేసిన పిక్ లో అయాన్ ఓ డిఫరెంట్ కొత్తరకం హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. అల వైకుంఠపురంలో మూవీలో బన్నీ హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేశాడో.. అచ్చం అలాంటి లుక్ లోనే దర్శనమిచ్చాడు అయాన్. ప్రస్తుతం అయాన్ హెయిర్ స్టైల్ చూసి అల్లు ఫ్యాన్స్ అంతా.. స్టైల్ లో తండ్రికి తగ్గ తనయుడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక బన్నీ హెయిర్ స్టైల్ తో పోల్చుతూ.. ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు. మరి బన్నీ తనయుడు అయాన్ న్యూ హెయిర్ స్టైల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Stylish Star Allu Ayan ❤️ pic.twitter.com/BwZJtcKHCq
— Rolex (@RolexForLife) February 17, 2023