తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏమాత్రం విరామం దొరికినా తన కుటుంబంతో జాలీగా గడుపుతుంటారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ పుష్ప 2తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ ఫ్యాన్స్ తో ఎంత టచ్ లో ఉంటాడో.. బన్నీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని ఆయన భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో తెలియజేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడు అయాన్ కి సంబంధించి ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది.