తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏమాత్రం విరామం దొరికినా తన కుటుంబంతో జాలీగా గడుపుతుంటారు.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాత దేశముదురు చిత్రంతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను ఆకట్టున్నాడు. తెలుగులోనే కాదు.. మాలీవుడ్ లో సైతం అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ బిజీలో ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ తన పిల్లలతో సరదాగా ఆరుబయట మంచంపై ఆడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హోదా సంపాదించాడు. అల్లు అర్జున్ రీలో లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో తాను ఎంతగానో ప్రేమించిన స్నేహారెడ్డిని.. పెద్దలను ఒప్పించి 2011, మార్చి 6న వివాహం చేసుకున్నాడు. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ కొత్త జంటగానే కనిపిస్తుంటారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు… అయాన్, అర్హ. ఇటీవల అర్హ ‘శకుంతలం’ చిత్రలో కనిపించింది. అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం దొరికితే చాలు భార్యాపిల్లలతో కలిసి వెకేషన్స్ టూర్స్ కి వెళ్తుంటారు.. లేదా ఇంట్లోనే పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు స్నేహా రెడ్డి.
అల్లు అర్జున్ ఆరుబయట మంచంపై తన పిల్లలు అల్లు అయాన్, అర్హాలతో కలిసి ఆడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ తన పిల్లలతో ఇంటి ఆవరణలో సవారు మంచంపై పడుకొని అహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ.. తన పిల్లలకు ఆశాకం వైపు చూపిస్తూ ఎదో ముచ్చటిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తో కూతురు అర్హ అల్లరి చేస్తున్నట్లు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ వీడియో జూన్ 2, 2021 లో స్నేహారెడ్డి తన ఇన్స్ స్ట్రాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో లో బ్యాగ్ గ్రౌండ్ సాంగ్ యాడ్ చేయడంతో మంచి ఫీల్ కలుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు చూసి తెగ మురిసిపోతున్నారు.