Allu Arjun: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ కోసం ఇటు అభిమానులతో పాటు, అటు సగటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఇప్పటివరకు మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. అవి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక, వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంకో సినిమా రాబోతోందంటూ చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అల్లు అర్జున్ నటించబోయే 22వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారంట. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం. పుష్ప ది రూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఏఏ22 షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, 2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కి.. 365 కోట్ల రూపాయల మేర వసూళ్లను కొల్లగొట్టింది. దేవీశ్రీ అందించిన మ్యూజిక్.. పాటలు దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. ప్రస్తుతం పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కేజీఎఫ్ 2 సంచలన విజయం సాధించిన నేపథ్యంలో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథలో మార్పు చేసినట్లు తెలుస్తోంది.
ఇక, పుష్ప 2లో అల్లు అర్జున్ 55 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, అది ఎంత వరకు నిజం అన్నదానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ముందెన్నడూ కనిపించని విధంగా బాగా బరువు పెరిగారు. మరి, త్రివిక్రమ్-బన్నీ ప్యాన్ ఇండియా మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Daddy Movie Child Artist: చిరంజీవి “డాడీ” సినిమాలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ!