Daddy Movie Child Artist Anushka Malhotra Present Pics Viral: సినినమాల్లో కనిపించే చైల్డ్ ఆర్టిస్టులు కూడా అప్పుడప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. క్యూట్ లుక్స్‌తో, ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటారు. చిన్నతనం నుంచే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ట్విన్ సిస్టర్స్ షామిలి, షాలిని ఈ కోవలోకే వస్తారు. బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ప్రేక్షకులకు దగ్గరైన వీరు.. ఆ తర్వాత హీరోయిన్లుగా కూడా రాణించారు. అయితే కొందరు మాత్రమే ఇలా ఇండస్ట్రీని అంటి పెట్టుకుని ఉంటారు. తేజా సజ్జా, ఆకాష్ పూరి, మాస్టర్ భరత్ ఈ కోవలోకే వస్తారు. తాజాగా ఈ జాబితాలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ చేరింది. ఆ వివరాలు.. చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన `డాడీ` చిత్రం 2001, అక్టోబర్‌లో విడుదలైంది. మాస్ హీరో అయిన చిరంజీవిని ఈ పాత్రలో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా సాగే చిత్రమిది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా నచ్చింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కాకపోతే కమర్షియల్‌గా మాత్రం సత్తాచాటలేకపోయింది. ఇక ఈ సినిమాల్లో అందరికన్నా.. చిన్నారి ఐశ్వర్య, అక్షయ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసిన అనుష్క మల్హోత్రా బాగా ఆకట్టుకుంది. అందరి హృదయాలను గెలుచుకుంది. ఇది కూడా చదవండి: Jr.NTR:అనారోగ్యంతో ఉన్న అభిమానికి అండగా నిలిచిన యంగ్ టైగర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra) ఈ చిత్రంలో చిరంజీవి, సిమ్రాన్‌ల కంటే అందరి దృష్టి చిన్నారి బేబీ అనుష్క మీదే పడింది. తన తేనె కళ్లతో, బుజ్జి బుజ్జి మాటలతో మాయ చేసింది. డ్యూయెల్ రోల్లో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెర మీద కనిపించలేదు. `డాడీ` సినిమా విడుదలై ఇరవై ఏళ్ల పైనే కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉందో, ఏం చేస్తుందో అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. హీరోయిన్లకి మించిన అందంతో ఎంతో ముద్దుగా, అందంగా ఉంది అనుష్క మల్హోత్రా. ఇది కూడా చదవండి: చంపుతామంటూ హీరోయిన్ కి బెదిరింపు లేఖ! అనుష్క మల్హోత్రా తెలుగమ్మాయి కాకపోయినా కూడా `డాడీ`లో చిరుతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది అనుష్క. అచ్చంగా తండ్రీ కూతుళ్లే అనిపించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు కూడా ఈ పాప పేరు తెలుగులో మార్మోగిపోయింది. `డాడీ` తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు అనుష్క. సినిమాలకు దూరమైన ఈ చిన్నారి పూర్తిగా కెరీర్‌ని స్టడీస్‌పై పెట్టింది. డిగ్రీ పూర్తి చేసిందని, త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాకి కమిట్ అయ్యిందట. మరి ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Casting Couch Experience: నిర్మాతనంటూ కాల్.. కాంప్రమైజ్ అయితే మంచి ఛాన్స్ ఇస్తానన్నాడు: నటి View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra) View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra)