మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘గని‘. ఏప్రిల్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఈ కార్యక్రమానికి బన్నీ వచ్చే దారిలో ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. ఆర్ కే బీచ్ వద్ద మెగా అభిమానుల సందోహం మధ్య బన్నీ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బన్నీ తన కారు పై నిలబడి ఫ్యాన్స్ కి అభివాదం చేసి అనంతరం కారు దిగి లోపలికి వెళ్లిన వీడియోలో.. ఫ్యాన్స్ మొబైల్స్ లో బన్నీని వీడియో తీయడం మనం చూడవచ్చు. అభిమాన హీరోని చూసేసరికి ఫ్యాన్స్ ఆనందం రెట్టింప అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.