షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు అని అందరికీ తెలుసు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం తగిన సమయం కేటాయించడంలో బన్నీకి మంచి మార్కులే వస్తాయి. తాజాగా స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. అందులో అల్లు అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఎప్పుడూ అల్లు అర్జున్ అప్‌డేట్స్ పెడుతూ ఉంటాడు.. ఈసారి స్నేహారెడ్డి ఈ వీడియోని రివీల్ చేసింది.
ఇదీ చదవండి: ఫ్లాపైన జెస్సీ- సిరి గేమ్ ప్లాన్.. కన్నీరు పెట్టుకుంటూ షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్
ఈ వీడియోలో అల్లు అర్జున్ కార్ డ్రైవ్ చేస్తా ఉంటే.. క్యూట్ అల్లు అర్హ వెనుక సీట్‌లో ఫోన్‌లో మునిగిపోయి కనిపించింది. ఇంక స్నేహారెడ్డి ఈ వీడియోని చిత్రీకరించింది. ఏదో రద్దీ రోడ్‌లో అల్లు అర్జున్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఫ్యామిలీతో అల్లుఅర్జున్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ వీడియోలో అయాన్ మాత్రం కనిపించలేదు. వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా నుంచి మోస్ట్ పాపులర్ సాంగ్ గుచ్చే గులాబిలాగా సాంగ్ ప్లే అవుతోంది.
ఇంక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప పార్ట్-1 ఈ డిసెంబర్‌కు విడుదల కానుంది. వచ్చేనెల రెండోవారానికే షూటింగ్ పూర్తి చేయాలని సుకుమార్ డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. పుష్ప నుంచి మొదటి నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా.. తెగ వైరలవుతోంది. అందుకు సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ ఒక ఉదాహరణ. దాక్కో దాక్కో మేక ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. తర్వాత వచ్చిన చూపే బంగారమాయనే సాంగ్ అయితే యూట్యూబ్ షేక్ చేస్తోంది. ఇవన్నీ చూసి అభిమానులు సినిమాపై ఇంకా అంచనాలను పెంచేసుకుంటున్నారు.