తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ప్రస్తుతం 5వ సీజన్ నడుస్తుంది. ఈసారి బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. కింగ్ నాగార్జున వరుసగా మూడోసారి ‘బిగ్ బాస్’ షో హోస్ట్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ‘బిగ్ బాస్ 5’ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో కొనసాగుతోంది.
టాలీవుడ్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటాడు. తన ఫిజిక్ మెయింటైన్ మీద ఎక్కువగా అమల స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు గా తెలుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు నాగ్ ఫిట్ నెస్ గురించే మాట్లాడుతుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో కింగ్ నాగార్జున వేసుకునే కాస్ట్యూమ్స్ వరల్డ్ లోనే టాప్ మోస్ట్ బ్రాండెడ్ అని తెలుస్తోంది. ఈ మద్య నాగార్జున ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ లో కనిపించారు.
ఆ షర్ట్ లుక్ ఎంతో బాగుంది.. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతే ఆ షర్ట్ ఖరీదు ఎంతుంటుందబ్బా అంటూ సెర్చ్ చేశారు ఫ్యాన్స్. ఇక షర్ట్ యూఏఎస్ డాలర్స్ ప్రకారం..$1110 రూపాయలు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 82,211 రూపాయలు అన్నమాట. అయితే ఈధర తో చిన్నపాటి వివాహం అవుతుంది అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కింగ్ వేస్తే ఆమాత్రం కాస్ట్ ఉండాల్లే అని కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ప్రస్తుతం నాగ్ నటిస్తున్న ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’ సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి.