శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సామ్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. వస్తోంది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా విడాకులపై స్పందించింది. వివాహ బంధంలో నేను నిజాయితీగా ఉన్నా గానీ వర్కౌట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సమంతకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది సామ్. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే హీరో నాగచైతన్యతో పెళ్లి.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకుని అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈనేపథ్యంలో.. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సామ్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. వస్తోంది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా విడాకులపై స్పందించింది. వివాహ బంధంలో నేను నిజాయితీగా ఉన్నా గానీ వర్కౌట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సమంత.. గత కొంతకాలంగా వార్తల్లో తరచుగా వినిపిస్తోన్న పేరు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. చికిత్స తీసుకుంటూనే సినిమాలు చేస్తోంది. తాజాగా సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తూ.. వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తొలి సారిగా వెల్లడించింది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..”నేను వివాహ బంధంలో ఎంతో నిజాయితీగా ఉన్నాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకు విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత నాకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. ఈ సాంగ్ ఆఫర్ గురించి కొంత మంది నాతో.. విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే నీకు ఐటెం సాంగ్స్ ఎందుకు ఇంట్లో కూర్చోకుండా అంటూ మాట్లాడారు” అని చెప్పుకొచ్చింది సమంత. ఆ ఐటెం సాంగ్ ఇంకేదో కాదు పుష్ఫ సినిమాలో ఊ అంటావా.. మావా ఊహు అంటావా మావా పాటే. ఈ ఒక్క పాటలో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమా చేస్తోంది. ప్రస్తుతం శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.