శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సామ్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. వస్తోంది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా విడాకులపై స్పందించింది. వివాహ బంధంలో నేను నిజాయితీగా ఉన్నా గానీ వర్కౌట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఓ స్థాయిలోకి వచ్చాక నటీ, నటులు ప్రయోగాల బాట పట్టడం సహజమే. హీరోలు కథల ఎంపికలో మార్పులతో పాటు మల్టీస్టారర్ లు చేయడానికి సిద్దపడుతుంటారు. ఇక హీరోయిన్ లు సైతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలల్లో మెరుస్తుంటారు. అదీకాక భారీ చిత్రాల్లో ఐటెమ్, స్పెషల్ సాంగ్స్ ల్లో చిందులు వేయడానికి రడీగా ఉంటారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఆరాటపడుతుంటారు. దానితో పాటు తమ అభిమాన నటుడితో ఆడిపాడలని […]